వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం అనర్హుడు: హై కోర్టులో పిటిషన్ !

తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం పన్నీర్ సెల్వం పదవికి అనర్హుడు అంటూ హైకోర్టులో పిటిషన్ ఎక్కడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండవా అంటున్న న్యాయనిపుణులు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పదవి రద్దు చెయ్యాలని, ఆయన పదవికి అనర్హుడని మద్రాసు హైకోర్టులో ఆర్ టీఐ కార్యకర్త అర్జీ సమర్పించారు. నియమాలకు విరుద్దంగా పన్నీర్ సెల్వంను ఉప ముఖ్యమంత్రి పదవిలో నియమించారని ఆర్ టీఐ కార్యకర్త ఆరోపించారు.

అన్నాడీఎంకే పార్టీ కథ క్లైమాక్స్ కు: ఢిల్లీకి సీఎం పళని, పన్నీర్: శశికళకు అక్కడే చెక్ !అన్నాడీఎంకే పార్టీ కథ క్లైమాక్స్ కు: ఢిల్లీకి సీఎం పళని, పన్నీర్: శశికళకు అక్కడే చెక్ !

మంగళవారం మద్రాసు హైకోర్టులో పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించాలని, తమిళనాడు ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మెజారిటీ లేదని అర్జీ సమర్పించారు. బుధవారం అర్జీ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఆర్ టీఐ కార్యకర్త సమర్పించిన పిటిషన్ అర్దరహితంగా ఉందని కొందరు న్యాయవాదులు అంటున్నారు.

Case against the swearing of Deputy CM Panneerselvam

ఇంత వరకు తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి పదవి లేదని, ఇప్పుడు కొత్తగా పన్నీర్ సెల్వం కోసం ఆ పదవి తెరమీదకు తీసుకు వచ్చారని ఆర్ టీఐ కార్యకర్త పిటిషన్ లో వివరించారు. భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి.

తమిళనాడు సీఎం పళనిసామి పదవికి ఎసరు: పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ !తమిళనాడు సీఎం పళనిసామి పదవికి ఎసరు: పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ !

కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని, ఆ పదవి ఉండాలా వద్దా అనేది పార్టీ హై కమాండ్, సీఎం నిర్ణయిస్తారని న్యాయనిపుణులు అంటున్నారు. మొత్తం మీద బుధవారం పన్నీర్ సెల్వం పదవి విషయంలో మద్రాసు హైకోర్టు ఓ నిర్ణయం తీసుకోనుందని న్యాయనిపుణలు అంటున్నారు.

English summary
A petition has been filed in the Madras HC against the swearing in of Deputy CM O Panneerselvam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X