వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ హామిని నిలబెట్టుకున్నారు ఓకె.. మరి దాని సంగతేంటి.. రాంచీ కోర్టులో మోదీ,అమిత్ షాలపై కేసు

|
Google Oneindia TeluguNews

దేశంలో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ.. నల్లధనంపై ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో దాచబడ్డ నల్లధనాన్ని వెలికితీసి.. దేశంలోని ప్రతీ పౌరుడి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. కానీ బీజేపీ గత ఐదేళ్ల పాలనలో ఆ హామీని నిలబెట్టుకోలేదు. దీనిపై తరుచూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇదే అంశంపై ఇటీవల ఓ వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

రాంచీ కోర్టులో కేసు నమోదు..

రాంచీ కోర్టులో కేసు నమోదు..


జార్ఖండ్‌లోని రాంచీ కోర్టులో హెచ్‌కె సింగ్ అనే ఓ న్యాయవాది ప్రధాని మోదీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలపై సెక్షన్ 415 (మోసం),సెక్షన్ 420(దగా) కింద ఫిర్యాదు చేశారు. వాటితో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(b)కూడా జోడించారు. తాము అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని చెప్పి.. ప్రజలను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ హామీ ఓకె.. మరి దాని సంగతేంటి..

ఆ హామీ ఓకె.. మరి దాని సంగతేంటి..

హెచ్‌కె సింగ్ ఫిర్యాదుపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హెచ్‌కె సింగ్ మాట్లాడుతూ.. '2019లోక్‌సభ ఎన్నికల హామీల్లో సీఏఏ కూడా ఒకటని అమిత్ షా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు దాన్ని అమలుచేయబోతున్నామని అంటున్నారు.' అని కోర్టుకు తెలిపారు. అయితే సీఏఏ ఎన్నికల హామీ అని.. అందుకే దాన్ని అమలుచేస్తున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. మరి రూ.15లక్షల హామీని మాత్రం ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు.

హెచ్‌కె సింగ్ వాదన..

హెచ్‌కె సింగ్ వాదన..

ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేయవద్దని ప్రజాప్రాతినిధ్య చట్టం చెబుతోందని హెచ్‌కె సింగ్ వాదించారు. ఇది ప్రజలను మోసం చేయడం కిందకే వస్తుందన్నారు. ఇదే కేసు గత శనివారం విచారణకు వచ్చినప్పుడు రాంచీ కోర్టు హెచ్‌కె సింగ్‌కు పలు ప్రశ్నలు వేసింది. ఈ కేసు రాంచీ కోర్టు పరిధిలోకి వస్తుందని ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాదు,బీజేపీ ఆ హామీని 2014 ఎన్నికల సమయంలో ఇస్తే.. ఇప్పటిదాకా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది.

 పబ్లిసిటీ స్టంట్ అంటున్న బీజేపీ

పబ్లిసిటీ స్టంట్ అంటున్న బీజేపీ

బీజేపీ ఇచ్చిన రూ.15లక్షల హామీకి మిగతా ప్రజల్లాగే తాను కూడా మోసపోయానని హెచ్‌కె సింగ్ అన్నారు. వాళ్లకు ద్వంద్వ ప్రమాణాలు ఉండరాదన్నారు. సీఏఏపై తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నప్పుడు. రూ.15లక్షల హామీని మాత్రం ఎందుకు నిలబెట్టుకోరని ప్రశ్నించారు. బీజేపీపై కోర్టులో నమోదైన కేసుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలోక్ ధూబే స్పందించారు. ప్రజలు బీజేపీ తప్పుడు వాగ్దానాలు,అబద్దాలతో విసిగిపోయారని.. అందుకే ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఇదో చీప్ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేసింది.

English summary
A district court in Ranchi has started proceedings in a case where Prime Minister Narendra Modi and Home Minister Amit Shah have been accused of cheating and dishonesty. The third accused in this case is Union minister Ramdas Atawle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X