వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీపై దేశ ద్రోహ కేసు .. ఎందుకంటే ?

|
Google Oneindia TeluguNews

డిస్పూర్ : జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌరవించి సంబోధించడంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకడుగు ముందేసిన సమాచార హక్కు కార్యకర్త రాజు మహంతా దేశ ద్రోహ కేసు పెట్టారు. అసోంలోని మోరిగన్ జిల్లాలోని పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

<strong>ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ .. యూజర్ల ఆగ్రహం, పరిష్కరిస్తామన్న కంపెనీలు</strong>ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సర్వర్ డౌన్ .. యూజర్ల ఆగ్రహం, పరిష్కరిస్తామన్న కంపెనీలు

ఉగ్రవాదిని గౌరవిస్తారా ?

ఉగ్రవాదిని గౌరవిస్తారా ?

దేశంలో అశాంతి సృష్టిస్తోన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను గౌరవించడం ఏంటని ప్రశ్నించారు. ఉగ్రవాదిని గారు అను పిలువడం దేశ వ్యతిరేకమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని .. విచారణ జరుపుతున్నామని మోరిగన్ పోలీసులు చెప్తున్నారు.

దేశంలో దాడులకు తెగబడ్డ మసూద్

దేశంలో దాడులకు తెగబడ్డ మసూద్

మసూద్ అజహర్ దేశంలో దాడులకు తెగబడి అలజడి స‌‌ృష్టించాడు. పార్లమెంట్ లో దాడి మొదలుకొని .. పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై దాడికి తెగబడ్డాడు. యూరీ ఉగ్రదాడి చేయగా .. అందుకు భాతర్ ధీటుగా సర్జికల్స్ స్ట్రైక్ చేపట్టింది. ఇటీవుల పుల్వామాలో చేసిన దాడితో మొత్తం పదుల సంఖ్యలో జవాన్లు నెలకొరిగారు. వీటిని తిప్పికొట్టేందుకు బాలాకోట్ లో వైమానిక దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.

ముజఫర్ కోర్టులో కూడా ..

ముజఫర్ కోర్టులో కూడా ..

మసూద్ అజహర్ ను రాహుల్ గాంధీ గౌరవించడంపై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ అసోంలో కేసు నమోదు కాగా .. నిన్న ముజఫర్ కోర్టులో సామాజిక వేత్త ఒకరు కేసు పెట్టారు. 'ఉగ్రవాదిని రాహుల్ గాంధీ గౌరవించి, దేశ ప్రజల సెంటిమెంట్ ను భంగం కలిగించారని‘ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మీరే అప్పగించారు కదా .. రాహుల్ కౌంటర్

మీరే అప్పగించారు కదా .. రాహుల్ కౌంటర్

తనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, బీజేపీ నుంచి విమర్శలు తీవ్రతరం కావడంతో రాహుల్ గాంధీ స్పందించారు. 'ఎవరైతే 56 ఇంచుల ఛాతీ అని అధికారంలోకి వచ్చారో, వారి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ .. ఇదివరకు కాందాహర్ లో మసూద్ అజహర్ ను అప్పగించిన విషయం మరచిపోయారా‘ అని బీజేపీ ప్రభుత్వాన్ని, ధోవల్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.

English summary
A sedition case was Wednesday filed against Congress president Rahul Gandhi in Assam's Morigaon district for allegedly revering Jaish-e- Mohammed (JeM) chief Masood Azhar by suffixing honorific "ji" to his name. RTI activist Raju Mahanta filed the complaint, contending that the Congress chief has shown his "anti-India stance by addressing a terrorist with a 'ji'", Pradip Nath, the officer-in-charge of Morigaon police station. An FIR has been registered in the case and police are .. investigating the matter, Nath added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X