వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ లో పెరుగుతున్న కేసులు: టోంక్ సందర్శించనున్న డబ్య్లూహెచ్‌వో బృందం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు 2586 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించటానికి లాక్ డౌన్ చేసి మరీ సమరం సాగిస్తునాయి వైరస్ ప్రభావిత దేశాలు . ఇక ఈ వైరస్ ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) తేల్చి చెప్తుంది.

రాజస్థాన్ లోనూ పెరుగుతున్న కేసులు

రాజస్థాన్ లోనూ పెరుగుతున్న కేసులు

ఇక భారత్ లో కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సర్వే చేపట్టనుంది . రాష్ట్రంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యంలో సర్వే జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం శుక్రవారం రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాను సందర్శిస్తుందని ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు. రాజస్థాన్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం 154 కు పెరిగింది, టోంక్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16 గా ఉంది. 154 లో, టోంక్ నుండి 12 సహా 21 కేసులు శుక్రవారం నమోదయ్యాయి.

టోంక్ సందర్శించనున్న డబ్య్లూహెచ్‌వో బృందం సచిన్ పైలట్ ట్వీట్

టోంక్ సందర్శించనున్న డబ్య్లూహెచ్‌వో బృందం సచిన్ పైలట్ ట్వీట్

టోంక్ నుండి ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో కేసులు పెరగడంతో కరోనా విషయంలో సర్వే నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయంలో " గత 24 గంటల్లో రాష్ట్రంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగింది. ఈ క్లిష్ట పరిస్థితిని బట్టి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఒక బృందం ఈ రోజు టోంక్ సందర్శించి ఒక సర్వేను నిర్వహిస్తుంది" అని పైలట్ ట్వీట్ చేశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ సమర్పించిన నివేదిక మరియు మార్గదర్శకాలను మేము ఖచ్చితంగా పాటిస్తాము మరియు అనుసరిస్తామని వైరస్ వ్యాప్తిని నివారించడం మరియు ఆరోగ్యంగా ఉండటం మా అత్యంత ప్రాధాన్యత. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు అని సచిన్ పైలట్ అన్నారు.

Recommended Video

PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
కొన్ని పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ నిజాముద్దీన్ సభ మూలాలు

కొన్ని పాజిటివ్ కేసుల్లో ఢిల్లీ నిజాముద్దీన్ సభ మూలాలు

ఇక టోంక్‌లోని పాజిటివ్ కేసులలో నాలుగు డిల్లీలోని నిజాముద్దీన్‌లోని తబ్లిఘి జమాత్ సమావేశానికి హాజరయ్యారు, మిగిలిన 12 మంది వారి సన్నిహితులు . ఇక జైపూర్ నుండి గరిష్టంగా 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, రామ్‌గంజ్ ప్రాంతం నుండి 33 కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 423కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ లో 154 కు కేసుల సంఖ్య చేరింది .

English summary
A team from the World Health Organisation will visit Rajasthan's Tonk district today to conduct a survey in the wake of rising number of coronavirus cases in the state, Deputy Chief Minister Sachin Pilot said."There has been a spike in the number of COVID-19 cases in the state in last 24 hours with an increase in the number of positive cases reported from Tonk. Given this critical situation, a team from WHO will visit and conduct a survey in Tonk today," Mr Pilot tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X