వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి వరకు కరెన్సీ కష్టాలు కొనసాగే అవకాశం,కొత్త ఐదువందల నోట్లు వస్తే కష్టాలు తప్పేవి

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఫిబ్రవరి చివరి వారం పట్టే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కొత్త ఐదువందల రూపాయాల నగదు నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్ లోకి వస్త

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఫిబ్రవరి నెలాఖరు వరకు కరెన్సీ కష్టాలు కొనసాగే అవకాశం ఉందని బ్యాంకు అదికారులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఐదువందల కరెన్సీ నోటు మార్కెట్లోకి విపరీతంగా వస్తేనే ఈ సమస్య తీరే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఖాతాదారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ నగదును డ్రా చేసుకోవడానికి ఫిబ్రవరి వరకు వేచిచూడాల్సిందేనని బ్యాంకర్లు చెబుతున్నారు.

నవంబర్ 8వ, తేది రాత్రిన కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తర్వాత దేశంలో ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు.బ్యాంకులు, ఎటిఎంల వద్ద కరెన్సీ కోసం ప్రజలు బారులు తీరుతున్నారు.

డిసెంబర్ 30వ, తేదితో కరెన్సీ కష్టాలు తీరుతాయని పాలకులు చెబుతోంటే , ఫిబ్రవరి చివరి వరకు కరెన్సీ కష్టాలు కొనసాగే అవకాశం ఉందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.

కొత్త ఐదు వందల నోటు మార్కెట్ లో మరింతగా లభ్యమైతే ఈ సమస్య తీరే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ ఖాతాలో నుండి ఎలాంటి ఆంక్షలు లేకుండా నగదును ఉపసంహరించుకొనే స్వేచ్చ ఖాతాదారులకు దక్కాలంటే ఫిబ్రవరి వరకు వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఫిబ్రవరి వరకు కరెన్సీ కష్టాలు

ఫిబ్రవరి వరకు కరెన్సీ కష్టాలు


పెద్ద నగదు నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే నవంబర్ మాసంలో పడినట్టుగా ప్రస్తుతం ఇబ్బందులు పడడంలేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే కరెన్సీ కష్టాలు మాత్రం కొనసాగే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.రద్దుచేైసిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 30వ, తేది వరకు గడువును విధించారు.అయితే ఈ గడువు మూడురోజుల్లో ముగియనుంది. కొత్త కరెన్సీ మార్కెట్ల్లోకి విపరీతంగా వస్తే ఖాతాదారులు తమ ఖాతాల నుండి ఎలాంటి పరిమితులు లేకుండా నగదును ఉపసంహరించుకొనే అవకాశం ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.ఐదు వందల రూపాయాల నగదు నోటు ఆలస్యంగా బ్యాంకులకు చేరడం కూడ కొంత ఇబ్బందికి కారణంగా అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

ఇప్పటికీ ఆరు లక్షల కోట్లు వచ్చాయి

ఇప్పటికీ ఆరు లక్షల కోట్లు వచ్చాయి

పెద్ద నగదు నోట రద్దు తర్వాత ఆరు లక్షల కోట్లు అందుబాటులోకి వచ్చాయి.అయితే ఇందులో ఎక్కువగా రెండువేలు, వంద రూపాయాల నగదు నోట్టు ఉన్నాయి.మార్కెట్లో చలామణిలో ఉన్న నగదు కరెన్సీలో రెండువేల నోట్లు ఎక్కువగా ఉన్నాయి.అయితే కొత్త ఐదువందల రూపాయాల నగదు నోటు ఎక్కువగా అందుబాటులోకి రాని కారణంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి.రెండువేల రూపాయాల నగదు మార్పిడి కోసం ఇబ్బందులు ఎదురౌతున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

ఎటిఎం లనుండి పరిమితి పెంపే అవకాశం

ఎటిఎం లనుండి పరిమితి పెంపే అవకాశం

ఎటిఎంల నుండి పరిమిత సంఖ్యలో నగదును ఉపసంహరించుకొనే అవకాశాన్ని ఎత్తివేసే అవకాశాలున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఎటిఎంల మెషీన్ల రీక్యాలిబ్రేషన్ పూర్తైనందున ఉపసంహరణ సడలింపు చేసేందుకు వెసులుబాటు కూడ దక్కే అవకాశం ఉంది.అయితే బ్యాంకులకు పెద్ద ఎత్తున ఐదువందల కొత్త కరెన్సీ నోట్లు వస్తే ఎటిఎంల నుండి ఉపసంహరణ ఆంక్షలను ఎత్తివేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

వ్యాపారాలు మెరుగుపడకుంటే మొండి బకాయిలుగా మారే అవకాశం

వ్యాపారాలు మెరుగుపడకుంటే మొండి బకాయిలుగా మారే అవకాశం

మార్కెట్ లోకి పెద్ద ఎత్తున నగదు రాకపోతే కొనుగోళ్ళు మందగిస్తాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు. అయితే రోజువారీ కార్యకలాపాలపై ఆదారపడే మద్య, చిన్న తరహసంస్థల వ్యాపారులకు సక్రమంగా కొనుగోళ్ళు లేకపోతే ఈ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపారాలు దెబ్బతింటే బ్యాంకుల నుండి తీసుకొన్న అప్పులు చెల్లించేందుకు డబ్బులు వారి వద్ద ఉండవని బ్యాంకర్లు అభిప్రాయంతో ఉన్నారు. దరిమిలా బ్యాంకుల నుండి తీసుకొన్న రుణాలన్నీ మొండి బకాయిలుగా మారే అవకాశం ఉందని బ్యాంకర్లు అభిప్రాయంతో ఉన్నారు.

బ్యాంకులకు పెద్ద దెబ్బ

బ్యాంకులకు పెద్ద దెబ్బ

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఎటిఎంల రీ క్యాలిబ్రేషన్ , మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఫీజు రద్దు, ఎటిఎంల లావాదేవీలపై చార్జీల రద్దు, సిబ్బందిపై ఖర్చుల కారణంగా బ్యాంకులపై భారం పెరిగే అవకాశం ఉందని ఎస్ బి ఐ బ్యాంకు చైర్మెన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. నగదు కొరత కారణంగా బ్యాంకులు వ్యాపార పరంగా నష్టపోయే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

English summary
the ongoing cash crunch will normalise by the end of Februray.With the demoentisation announcement, over 80 percent of the currency in circulation was taken back into the banking system. It’s important to get it replaced to make people feel comfortable,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X