వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌లో నిర్మలా మెలిక: ఖాతాదారుడి అనుమతి లేకుండా డిపాజిట్ చేశారో ఇక అంతే..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక సంస్కరణలు జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. డిజిటిల్ సేవలను ప్రోత్సహించడంతో .. వినియోగదారులు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఖాతాలో నగదు జమచేసే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఖాతాదారుడి సమ్మతిలేకుండా డబ్బులు జమచేసేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పింది.

సంస్కరణల పథం ..
తొలి పద్దును సమర్పించిన విత్త మంత్రి నిర్మలా సీతారామన్ .. సంస్కరణలకే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాల్లో ఇతరులు నగదు జమచేసేందుకు ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఖాతాదారుడి అంగీకారం లేకుండా .. నగదు డిపాజిట్‌ చేసేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ఒకవేళ ఖాతాదారుడి అనుమతితో మాత్రం డిపాజిట్ చేయొచ్చని తెలిపారు. ఇదీ ముఖ్యంగా జన్ ధన్ ఖాతాదారులకు వర్తిస్తుందని గుర్తుచేశారు.

Cash Deposit In Bank Accounts Without Holders Consent To Be Stopped

ఎందుకంటే ..?
ఈ కొత్త నిబంధన ఎందుకు తీసుకొచ్చామో వివరించారు. దేశంలో ప్రైవేట్ బ్యాంకు అజమాయిషీ తగ్గించేందుకు చర్యలు తీసుకున్నానని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరింత బలోపేతం అవుతాయని విశ్వసించారు. ప్రస్తుతం ఎవరో ఒకరు ఖాతాదారుడి అకౌంట్‌లో నగదు జమచేస్తున్నారని .. కానీ అలా చేయడంతో నగదు ఎక్కడినుంచి ఎలా వస్తుందో తెలిసే అవకాశం లేదని చెప్పారు. మరికొందరు తమ పన్ను ఎగవేత కోసం అడ్డదార్లు తొక్కుతారని గుర్తుచేశారు.

English summary
Nirmala Sitharaman in this context said, "Government will initiate steps to empower accountholders to remedy the current situation in which they do not have control over deposit of cash by others in their accounts. Reforms will also be undertaken to strengthen governance in Public Sector Banks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X