• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీక్‌కి చేరిన వర్ణ వివక్ష : దళితులకు కటింగ్ చేయని బార్బర్లు, బ్రహ్మచారులగానే యువత, ఎక్కడో తెలుసా..?

|

మొరాదాబాద్ : కాలం మారుతుంది. జీవనశైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ కొన్ని చోట్ల వర్ణ వివక్ష మాత్రం తగ్గడం లేదు. సూద్రులని కొందరినీ ఆలయాలకు రానీయని సందర్భాలు విన్నాం, చూశాం. దీనిని మేధావులు తప్పుపట్టారు. ఈ కాలంలో కూడా కుల,మతాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎందరూ కల్పించుకున్నా .. అలా చేయొద్దని చెప్తున్నా కొందరు మారడం లేదు. తమ వైఖరిలో మార్పు ఉండదని కుండబద్దలు కొట్టి మరీ చేస్తున్నారు. ఇటీవల యూపీలోని మొరాదాబాద్‌లో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.

వర్ణ వివక్ష

వర్ణ వివక్ష

మొరాదాబాద్ జిల్లా పీపల్‌సన గ్రామంలో ముస్లింలే మెజార్టీ. అందుకు గ్రామంలో మంగళ పనిని ముస్లింలే చేస్తారు. అయితే ఇక్కడ సమస్య వచ్చింది. గ్రామంలో ఎక్కువమంది ముస్లింలే ఉండగా .. కొందరు మాత్రం హిందువులు ఉన్నారు. వారిలో దళితుల సంఖ్య ఎక్కువే ఉంది. ఇక్కడే వివాదానికి అంకురార్పణ జరిగింది. ఇటీవల కొందరు దళితులకు కటింగ్, గడ్డం తీయమని ముస్లిం మంగళిలు చెప్పడంతో వివాదం రాజుకుంది. దీంతో విషయాన్ని దళితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కలెక్టర్‌కు చేరడంతో విచారణ జరిపించాలని సీనియర్ ఎస్పీని ఆదేశించారు. దీంతో గ్రామంలో వర్ణ వివక్షపై పోలీసుల విచారిస్తున్నారు.

నో కటింగ్

నో కటింగ్

గ్రామంలోని సెలూన్ షాపునకు ఇటీవల కొందరు దళితులు వెళ్లగా కటింగ్ చేయమని ముస్లిం మంగళి తేల్చిచెప్పారు. ఎందుకు చేయరని అంటే వర్ణ వివక్షే కారణమని తెలుస్తోంది. ఇక్కడి షాపులో మీకు కటింగ్, గడ్డం చేస్తే ముస్లింలు రారని పేర్కొన్నారు. ఊరిలో ముస్లింలే మెజార్టీ కాబట్టి తమ ఆదాయ వనరు కోల్పోతామని చెప్పారు. కానీ తమ పరిస్థితి ఏంటని అని దళితులు ప్రశ్నిస్తున్నారు. వివక్షను ఇప్పుడు తాము అనుభవిస్తున్నామని .. కానీ భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందారు.

సరికాదు ..

సరికాదు ..

సమాజంలో మార్పు వస్తుందని .. పిల్లలు చదువుకుంటున్నారని.. కానీ ఈ సమయంలో కూడా వర్ణ వివక్ష ఏంటని కొశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో కొందరు తమంటే ద్వేషిస్తున్నారని దళిత పెద్ద కల్లాన్ పేర్కొన్నారు. అందుకోసమే వారు సెలూన్ షాపులు మూసివేసి ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. ముస్లింల వైఖరితో తమ కుమారులకు వివాహం కూడా కావడం లేదని చెప్తున్నారు. కటింగ్ పెరిగి, గడ్డంతో మాసిపోయి ఉండటంతో పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. తమ బంధువులు కూడా తమను చిన్నచూపు చూస్తున్నారని దళిత యువకుడు అనిల్ పేర్కొన్నారు. కానీ పోలీసుల సూచనతో తమకు సేవ్ చేసేందుకు ముందుకొచ్చారని .. కానీ ఆ వర్గం నుంచి వస్తోన్న ఒత్తిడితో సెలూన్లు మూసివేశారని తెలిపారు. అయితే తాము కటింగ్ చేసుకోవాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

 విషయం ఏంటంటే ..

విషయం ఏంటంటే ..

దళితుల వాదన ఇలా ఉంటే .. ముస్లిం మంగళిలు మాత్రం తమ వాదనకే కట్టుబడి ఉన్నారు. తమ షాపులకు దళితులు రాలేదని పేర్కొన్నారు. అయితే భోజ్‌పూరీలో ఉన్న షాపులో మాత్రమే వారు ఇదివరకు కటింగ్ చేసుకునేవారని గుర్తుచేశారు. కానీ ఇటీవల తమ షాపులకు రావాలని చూస్తున్నారని ఆరోపించారు. తన 45 ఏళ్ల సర్వీసులో ఒక్కసారి కూడా దళితలు కటింగ్ కోసం తమవద్దకు రాలేదన్నారు ఓ ముస్లం మంగళి. తమకు ఈ వృత్తే జీవనాధారమని పేర్కొన్నారు. ఒకవేళ దళితులు తమ షాపులకు వస్తే తాము వేసే టవల్ మురికిగా మారిపోతాయని పేర్కొన్నారు. తర్వాత వాటితో ముస్లింలకు కటింగ్ చేయాలి అని ప్రశ్నించారు. ముస్లిం మంగళిలే కాదు ముస్లింలు కూడా దళితులకు కటింగ్ చేయడాన్ని తప్పుపట్టారు. గత కొన్నేళ్లుగా లేంది కొత్తగా ఏంటని ప్రశ్నించారు. ఇవాళ తమ షాపులకు వస్తా అన్న వారు .. రేపు ఫంక్షన్ హాల్స్ కూడా బుక్ చేసుకుంటారని పేర్కొన్నారు. గ్రామంలో దళితేలు ఒక బార్బర్ షాపు పెట్టుకోవాలని మరోకరు సూచించారు. దీంతో ఆ సామాజిక వర్గాల వారికి సేవలు అందించినట్టు అవుతుందని తెలిపారు.

English summary
The police and administration in Moradabad district of Uttar Pradesh are having a tough time as some Muslim barbers have refused to cut hair of Dailts from their village. In turn, the Dalits have approached police and the district magistrate alleging caste-based discrimination. Dalits in Peepalsana village under Bhojpur police station in Moradabad district have alleged that barbers in their village are refusing to entertain them at their shops. After receiving their complaints, Senior Superintendent of Police (SSP), Moradabad, Amit Pathak formed a joint team comprising cops and local district officials to investigate the matter. The SSP said if the allegations are found true, action will be taken under relevant laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X