వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CAT-2020 Exam Results:క్యాట్ ఫలితాలు విడుదల..బిజినెస్ స్కూల్స్ అడ్మిషన్స్ ప్రక్రియ ఏంటి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లోకి ప్రవేశం కోసం అర్హత పరీక్షగా నిర్వహించే CAT-2020 ఫలితాలను ఇండోర్‌లోని ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విడుదల చేసింది. ఆన్‌లైన్ ద్వారా ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను IIM-iimcat.ac.inలో పొందుపర్చడం జరిగింది. నవంబర్ 29న క్యాట్ పరీక్ష జరిగింది. ఇక స్కోర్‌ కార్డులు కూడా పొందుపర్చడం జరిగింది. ఇక ఐఐఎం క్యాట్ ఫలితాలు 2020ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు క్యాట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వినియోగించి అందులోకి లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

క్యాట్ స్కోర్ కార్డులో ఈ కింది వివరాలు ఉంటాయి.

సెక్షనల్ స్కేల్డ్ స్కోర్

సెక్షనల్ పర్సంటైల్ స్కోర్

ఓవరాల్ స్కేల్డ్ స్కోర్

ఓవరాల్ పర్సంటైల్ స్కోర్

ఓవరాల్ స్కేల్డ్ స్కోర్ అంటే మూడు సెక్షన్లలో కలిపి వచ్చే స్కేల్డ్ స్కోర్.

CAT-2020 Results declared, Here is how to check the score

ఇక క్యాట్ స్కోర్ 31 డిసెంబర్ 2021 వరకు చెల్లుబాటులో ఉంటుంది. జనవరి రెండో వారంలో క్యాట్‌ ఫలితాలను విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ తొలివారంలోనే విడుదల చేశారు. ఇక మంచి స్కోరు సాధించిన అభ్యర్థులను అభినందించారు ఐఐఎం ఇండోర్ డైరెక్టర్ హిమాన్షు రాయ్.

క్యాట్‌ పరీక్ష ఫలితాల విడుదల తర్వాత ఐఐఎంలు అభ్యర్థులను రాతపరీక్ష కోసం ఆహ్వానిస్తాయి. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. కటాఫ్ మార్కులు తెచ్చుకునే అభ్యర్థులు ఆయా ఐఐఎం అధికార వెబ్‌సైట్లను సందర్శించి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐఐఎంలు అభ్యర్థి యొక్క క్యాట్ పర్సంటైల్, అకడెమిక్ రికార్డు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తాయి.

English summary
IIM-Indore has released CAT-2020 results on January 2nd at 5:00 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X