వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధుడిని కాలితో తన్నిన బీజేపీ ఎంపీ (వీడియో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పోరుబందర్: గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన బీజేపీ ఎంపీ విఠల్ రాడియా మరోసారి వివాదాస్పదమయ్యారు. తన నియోజకవర్గంలోని ఓ దేవాలయంలో భజన చేస్తున్న వృద్ధుడిని కాళ్లతో తంతూ వీడియోకు చిక్కాడు.

అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ, ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. వీడియో ప్రకారం మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, తోటి భక్తులందరూ చూస్తుండగానే వృద్ధుడిని ఇష్టానుసారం కాలితో తన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని గద్దిస్తూ అడిగాడు.

Caught on Camera: BJP Gujarat MP Vitthal Radadiya repeatedly kicks an old man

దీంతో ఆయన అనుచరులు కలగజేసుకుని వృద్ధుడిని తన్నుకుంటూ బయటకు లాక్కెళ్లారు. ఇప్పుడు విఠల్ రాడియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ రాడియాపై ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయి. 2012లో గుజరాత్‌లోని ఓ టోల్‌గేట్‌ వద్ద బీభత్సం సృష్టించారు.

టోల్ గేట్ ఉద్యోగిని తుపాకీతో బెదిరించిన వీడియో అప్పట్లో హల్ చల్ సృష్టించింది. ఆయనపై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులు నమైదయ్యాయి. తాజాగా వృద్ధుడిపై కాలు చేసుకున్న ఎంపీ రాడాడియాపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.

English summary
The BJP MP Vitthal Radadiya is in controversy for kicking an old man. In a video, surfaced on the social media, the MP from Porbandar constituency of Gujarat is seen repeatedly kicking an old man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X