వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ రగులుతోన్న కావేరీ వివాదం.. మాండ్యాలో ఉద్రిక్తత పరిస్థితులు

|
Google Oneindia TeluguNews

కర్ణాటక : కావేరి జల వివాదం మళ్లీ రగులుతోంది. కావేరి నుంచి తమిళనాడుకు నీటి విడుదలపై.. కర్ణాటక వేసిన పిటిషన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో.. అక్కడి ప్రజలు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఈ నెల 27 నుంచి తమిళనాడుకు 6వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాల్సిందిగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాండ్యా ప్రాంత రైతులు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తోన్న మాండ్య రైతులు.. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయడమంటే తమకు ఉరి వేసినట్లేనని.. రోడ్లపై ఉరివేసుకున్నట్లుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేసి తమకు ఉరిశిక్ష వేసినంత పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Cauvery row: Mandya MP Puttaraju resigns in solidarity with Karnataka farmers

ఇక ఇదే అంశంపై మాండ్యా ప్రాంతానికి చెందిన జనతాదళ్ ఎంపీలు, ఎమ్మల్యేలు జిల్లా నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేసి తమ వ్యతిరేకతను చాటుకున్నారు. మాండ్యా డిప్యూటీ కమిషనర్ ద్వారా తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పంపించారు మాండ్యా ఎంపీ పుత్తరాజు. జనతాదళ్ ఎంపీ పుత్తరాజు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లోను ఆందోళనలు చోటు చేసుకుంటుండడంతో.. అప్రమత్తమైన పోలీసులు బెంగుళూరులో భారీగా పోలీసు బలగాలను మోహిరించారు. దీనిపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా కోరారు.

English summary
C.S.Puttaraju, MP from Mandya, the hot-bed of Cauvery water crisis and protests, resigned on Tuesday.The Janata Dal (Secular) leader submitted his resignation to Lok Sabha Speaker Sumitra Mahajan through the deputy commissioner of Mandya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X