వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ నీరు: ఆంధ్రా, తెలంగాణకు ఒక చట్టం, తమిళనాడు, కర్ణాటకకు ఒక చట్టామా: సుప్రీం కోర్టు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతరాష్ట్ర నదీ జలాల పంపిణి విషయంలో మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడే అన్ని రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి మీరు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు మీరు ఏర్పాటు చెయ్యకుంటే మేమే ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు కేంద్ర, కర్ణాటక ప్రభుత్వాలకు షాక్ ఇచ్చింది.

బుధవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ కావేరీ నీటి పంపిణి విషయంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు సమర్పించిన అర్జీలు పరిశీలించి వాదనలు విన్నారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తమిళనాడు, కేరళ న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు.

కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సాలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తమ వాదనలు వినిపించారు. అంతరాష్ట్ర నదీ జలాల పంపిణి చట్టం సెక్షన్ 6 ప్రకారం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడం, చెయ్యకపోవడం పార్లమెంట్ హౌస్ కు ఉంటుందని వాదించారు.

Cauvery water dispute final hearing over Supreme Court reserves verdict

పార్లమెంట్ లో చర్చించిన తరువాత కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలా ? వద్దా ? అనే నిర్ణయం మెజారీ పార్లమెంట్ సభ్యులు నిర్ణయిస్తారని రంజిత్ కుమార్ వాదించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రాలకు కృష్ణా నదీ జలాలు పంపిణి చెయ్యడానికి ప్రత్యేకంగా మేనేజ్ మెంట్ బోర్డు ఉందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది.

గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు నర్మదా నదీ జలలు పంపిణి చెయ్యడానికి ప్రత్యేకంగా మేనేజ్ మెంట్ బోర్డు ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. కావేరీ నీరు పంపిణి చెయ్యడానికి మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి మీకు అభ్యంతరం ఏమిటని కర్ణాటక తరపు న్యాయవాది నారిమన్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. వాదనలు విన్న సుప్రీం కోర్టు తుది తీర్పు రిజర్వులో పెట్టింది.

English summary
The Supreme Court on Wednesday reserved its verdict over Cauvery river water dispute involving the tussle between the two neighbouring states Karnataka and Tamil Nadu. The Supreme Court bench concluded the hearing today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X