బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కావేరీ తీర్పు: బెంగళూరులో 30 లక్షల మంది తమిళ ప్రజలు, టైట్ సెక్యూరిటీ, కన్నడిగ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Cauvery Water Dispute, Security Tightened

బెంగళూరు: కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తుదితీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. బెంగళూరు నగరంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ చెప్పారు. బెంగళూరులో సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి.

కర్ణాటక vs తమిళనాడు

కర్ణాటక vs తమిళనాడు

కావేరీ నీటి పంపిణి విషయంలో పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు దశాభ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. నీరు విడుదల చెయ్యాలని తమిళనాడు, మాకే నీళ్లు లేవని కర్ణాటక న్యాయపోరాటం చేస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటకతో పాటు కేరళ కూడా కావేరీ నీటి కోసం కోర్టును ఆశ్రయించింది.

 30 లక్ష్లల తమిళ ప్రజలు

30 లక్ష్లల తమిళ ప్రజలు

బెంగళూరు నగరంలో దాదాపు 30 లక్షల మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తమిళ ప్రజలు బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్నారు. కావేరీ నీటి పంపిణి తీర్పు ఎలా వస్తుందో అంటూ తమిళ ప్రజలు హడలిపోతున్నారు.

బెంగళూరులో నిఘా !

బెంగళూరులో నిఘా !

కావేరీ నీటి పంపిణి విషయంలో తీర్పు ఎలా వచ్చినా బెంగళూరులో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో గట్టి నిఘావేశారు. బెంగళూరు నగరంలో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి.

తమిళ ప్రజలు ఉండే ప్రాంతాలు

తమిళ ప్రజలు ఉండే ప్రాంతాలు

బెంగళూరు నగరంలోని హలసూరు, టిన్ ఫ్యాక్టరీ, విజనాపుర, కేజీహళ్ళి, డీజేహళ్లి, శివాజీనగర, అంజనప్ప గార్డెన్, మెజస్టిక్ సమీపంలోని శ్రీరాంపుర, శాంతినగర, కేఆర్ మార్కెట్, కాటన్ పేట, చామరాజపేట, జయనగర 9 బ్లాక్, జేపీ నగర్, జయమహల్, ఆర్ టీ నగర్, నాగవార, హెబ్బాళ, కేఆర్ పురం, రామమూర్తి నగర్, బాణసవాడి, అంజనప్ప బ్లాక్ తదితర ప్రాంతాల్లో లక్షల మంది తమిళ ప్రజలు నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా వేశారు.

కన్నడిగులు

కన్నడిగులు

కర్ణాటకకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తీర్పు వస్తే పోరాటం చెయ్యడానికి కన్నడిగులు సిద్దం అయ్యారు. బెంగళూరు నగరంతో సహ రామనగర, మండ్య, మైసూరు జిల్లాల్లో కన్నడ సంఘాలతో పాటు, రైతు సంఘాలు ఆందోళన చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.

English summary
All eyes are on the Supreme Court as it's poised to act on the decades-old Cauvery water dispute between the neighbouring states of Karnataka, Tamil Nadu, and Kerala.Security tightened espencially in Bengaluru, Mandya and Mysuru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X