వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, వ్యభిచారంలోకి, సీబీసీఐడీ కస్టడీకి లేడీ ప్రొఫెసర్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: విద్యార్థినిలను లైంగిక అవసరాలకు ప్రేరేపించి, ప్రలోభపెట్టి వ్యభిచారం కూపంలోకి దింపడానికి ప్రయత్నించిన తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా అరుప్పుకోటే దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని సీబీసీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. సతుర్ కోర్టులో హాజరుపరిచిన నిర్మలా దేవిని సీబీసీఐడి అధికారులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Recommended Video

నిర్మలాదేవి వ్యవహరంపై మాజీ ఐఎఎస్ అధికారి సంతానం కమిటీ విచారణ
మొబైల్ లో అశ్లీల చిత్రాలు

మొబైల్ లో అశ్లీల చిత్రాలు

అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి మొబైల్ ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి మొబైల్ లో అశ్లీల చిత్రాలు ఉన్నాయని, వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారని తెలిసింది. నిర్మలా దేవి మొబైల్ లోని కాల్ డేటాను సీబీసీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఫోన్ నెంబర్లు కీలకం

ఫోన్ నెంబర్లు కీలకం

అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి మొబైల్ లోని నెంబర్లను సీబీసీఐడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిర్మలా దేవి ఎవరెవరికి ఎక్కువ సార్లు ఫోన్ చేశారు. మదురై కామరాజర్ యూనివర్శిటీ అధికారులు ఎంత మంది నిర్మలా దేవికి టచ్ లో ఉన్నారు అని ఆరాతీస్తున్నారు.

ఇద్దరు పరార్

ఇద్దరు పరార్

లైంగిక క్రీడలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సహకరిస్తున్న మదురై కామరాజర్ యూనివర్శిటీలోని ఇద్దరు ఉద్యోగులు ఇప్పటికే పరారైనారు. నిర్మలా దేవి వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు ఉద్యోగులు మాయం కావడంతో వారి కోసం సీబీసీఐడి అధికారులు గాలిస్తున్నారు.

కోర్టులో హాజరు

కోర్టులో హాజరు

శుక్రవారం అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని సతుర్ కోర్టులో హాజరుపరిచారు. నిర్మలా దేవిని విచారణ చెయ్యడానికి తమ అదుపులోకి ఇవ్వాలని సీబీసీఐడీ ఎస్సీ రాజేశ్వరి కోర్టులో మనవి చేశారు. ఐదు రోజుల పాటు నిర్మలా దేవిని విచారణ చెయ్యడానికి సతుర్ కోర్టు అనుమతి ఇచ్చింది.

రహస్యప్రాంతంలో విచారణ

రహస్యప్రాంతంలో విచారణ

నిర్మలా దేవిని అదుపులోకి తీసుకున్న సీబీసీఐడి అధికారులు ఆమెను మహిళా పోలీసుల సమక్షంలో రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు నిర్మలా దేవి మీద చేసిన ఫిర్యాదులను సీబీసీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

English summary
Nirmala devi appear before Sathur court. CBCID wants Nirmala devi to be in their custody for further investigation, an they filed a plea in Sathur court court has given 5 days custody to CBCID.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X