వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాన్, ఆధార్ లింకింగ్ మస్ట్.. గడువు తేదీ తెలుసా? బ్యాంకు ఖాతాలకు లేనట్లేనా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు.. పాన్ కార్డు, ఆధార్ తో లింక్ చేయల్సిందేనంటున్నారు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ సుశీల్ చంద్ర. లేదంటే పాన్ కార్డులు రద్దవుతాయని తెలిపారు. ఇప్పటివరకు ఎవరైనా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోనట్లయితే త్వరపడాలని సూచించారు. పాన్, ఆధార్ అనుసంధానం కోసం మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు. చివరితేది దగ్గరకు వస్తున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆదాయపు పన్ను సమర్పించే ప్రతి ఒక్కరికి పాన్, ఆధార్ లింకింగ్ తప్పనిసరి అని తెలిపారు.

cbdt chairman says pan and aadhaar linking must for it returns

అసోచామ్ సదస్సులో పాల్గొన్న సుశీల్ చంద్ర.. బయోమెట్రిక్‌ ఐడి ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌ చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జారీ అయిన 42 కోట్ల పాన్ నెంబర్లకు గాను 23 కోట్ల పాన్ కార్డులు మాత్రమే ఆధార్ తో లింక్ అయినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీలోగా పాన్, ఆధార్ లింక్ ప్రక్రియ పూర్తిచేసుకోవాలని తెలిపారు. ఐటీ రిటర్న్స్ దాఖలుకు లింకింగ్ మ్యాండేటరీ అయినప్పటికీ.. మొబైల్, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరి కాదు.

English summary
Chairman of Central Board of Direct Taxes, Sushil Chandra said that IT returns are to be linked to PAN card and Aadhaar is mandatory. Otherwise the PAN cards will be canceled. PAN, Aadhar linking is mandatory for everybody who submits the Income Tax.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X