వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సందేహాలకు చెక్: ‘జీఎస్టీ’ ఆండ్రాయిడ్ యాప్ ఇదే

వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై ఆందోళన చెందుతున్న చాలా మంది వినియోగదారులపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జీఎస్‌టీ రేట్లపై ఉన్న వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం మొబైల్‌ .

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై ఆందోళన చెందుతున్న చాలా మంది వినియోగదారులపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జీఎస్‌టీ రేట్లపై ఉన్న వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం మొబైల్‌ యాప్‌ను శనివారం ప్రారంభించింది.

'జీఎస్‌టీ రేట్‌ ఫైండర్‌' పేరుతో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఈసీ) ఈ మొబైల్‌ యాప్‌ను తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఏయే వస్తువులపై ఏ పరిధిలో ఎంత పన్ను విధిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని వినియోగదారులు తెలుసుకోవచ్చు.

 CBEC launches GST app to clear doubts

అన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్ల ద్వారా ఈ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనూ ఈ యాప్‌ పని చేస్తుండటం గమనార్హం.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీపై సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందు కోసం ప్రత్యేకంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

English summary
The Central Board of Excise and Customs (CBEC) has launched a mobile app to clear doubts about the different rates of Goods and Services Tax (GST).
Read in English: CBEC launches GST app
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X