వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 కోట్ల లంచం: సీబీఐకి అడ్డంగా దొరికిన డీఆర్ఐ కీలక అధికారి

|
Google Oneindia TeluguNews

జాతీయ దర్యాప్తు సంస్థల్లో కీలకమైనదిగా భావించే డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లో పెద్ద అవినీతి భాగోతం బయటపడింది. డీఆర్ఐలో అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ)గా పనిచేస్తోన్న చంద్రశేఖర్ అనే అధికారిని సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. లూథియానాలో విధులు నిర్వహిస్తోన్న చంద్రశేఖర్ ను రూ.3 కోట్ల లంచం తీసుకున్న కేసులో అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెప్పారు.

CBI arrests DRI ADG in bribery case

ఆయనతోపాటు మరో ఇద్దరు మీడియేటర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 2019 జూన్‌లో ఓ సరుకు రవాణా సంస్థపై దాడి చేసిన చంద్రశేఖర్.. ఆ సమయంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కంపెనీకి తిరిగిచ్చేందుకు రూ.3 కోట్ల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

English summary
The CBI on Wednesday arrested a senior official of the Directorate of Revenue Intelligence (DRI) and two middlemen in connection with a Rs 3-crore bribery case, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X