వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఆపై వికృత చర్యలు .. యూపీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులకు కళ్ళు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత పదేళ్ళలో 50 మందికి పైగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని , అంతేకాదు ఆ వీడియోలను, ఫోటోలను పోర్న్ సైట్స్ కు విక్రయించాడని గుర్తించిన సిబిఐ అధికారులు ఆ మానవ మృగాన్ని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. గత పదేళ్ల కాలంలో ఐదు సంవత్సరాల నుండి 16 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 50 మంది మైనర్ లను లైంగిక వేధింపులకు గురి చేసినందుకు సదరు ఉద్యోగిని అరెస్టు చేసినట్లుగా చెప్తున్నారు.

యూపీలో దారుణం .. ఇద్దరు మైనర్ బాలికలను చంపి ఫతేపూర్ చెరువులో పడేసిన దుండగులుయూపీలో దారుణం .. ఇద్దరు మైనర్ బాలికలను చంపి ఫతేపూర్ చెరువులో పడేసిన దుండగులు

చిన్నారులపై లైంగిక దాడులు .. వీడియోలు, ఫోటోలు డార్క్ నెట్ లో అమ్మకం

చిన్నారులపై లైంగిక దాడులు .. వీడియోలు, ఫోటోలు డార్క్ నెట్ లో అమ్మకం

చిన్నారులను లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా నిందితుడు ఆన్ లైన్ లో చిన్నారులపై లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను , ఫోటోలను కూడా అమ్ముతున్నాడని సిబిఐ అధికారులు గుర్తించారు . చిత్రకూట్, బండా మరియు హమీర్ పూర్ అనే మూడు జిల్లాలలో ఈ మానవ మృగం చిన్నారులపై లైంగిక వేధింపులు కొనసాగించిందని సిబిఐ అధికారులు గుర్తించారు. బండాలో సదరు నిందితుడిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

 నిందితుడి నివాసాలపై సీబీఐ అధికారుల దాడి .. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి

నిందితుడి నివాసాలపై సీబీఐ అధికారుల దాడి .. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి

నిందితుడి నివాసం మరియు నిందితుడు తిరిగిన ఇతర ప్రదేశాలపై దాడులు నిర్వహించిన వారు అతని వద్ద నుండి 8 మొబైల్ ఫోన్లను, సుమారు ఎనిమిది లక్షల రూపాయల నగదును, సెక్స్ టాయ్స్ ను , ఒక లాప్ టాప్ మరియు ఇతర డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ఆధారంగా అతను పిల్లలను పెద్ద సంఖ్యలో లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు . గత పదేళ్లుగా పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేసి, వాటిని వీడియోలు తీసి, అశ్లీల చిత్రాలను తీసి ప్రపంచవ్యాప్తంగా విక్రయించేవాడని గుర్తించారు .

ఉత్తర ప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన జూనియర్ ఇంజనీర్‌ అకృత్యాలపై సీబీఐ విచారణ

ఉత్తర ప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన జూనియర్ ఇంజనీర్‌ అకృత్యాలపై సీబీఐ విచారణ

పెడోఫిలీస్‌కు డార్క్ నెట్‌లో సదరు లైంగిక వేధింపుల వీడియోలు, ఛాయాచిత్రాలను విక్రయాలు జరుపుతున్న ఉత్తర ప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన జూనియర్ ఇంజనీర్‌ను అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు అతడిని కోర్టులో హాజరు పరచనున్నారు. ప్రధానంగా పిల్లల లైంగిక వేధింపుల వీడియోలను విదేశాలలో డార్క్ నెట్ మరియు క్లౌడ్ సేవలను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాడని గుర్తించారు . సదరు మానవ మృగం తన కార్యకలాపాల గురించి చిన్నారులు బయటకు చెప్పకుండా ఉండడానికి వారికి మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను లంచంగా ఇచ్చేవాడిని అధికారులు గుర్తించారు.

English summary
The CBI has arrested a junior engineer of Uttar Pradesh irrigation department for alleged sexual exploitation of children for last 10 years and selling videos and photographs of nefarious acts on dark net to other paedophiles across the globe, officials said Tuesday. He is alleged to have victimised about 50 children in the age group of 5-16 years in the districts of Chitrakoot, Banda and Hamirpur, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X