వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్ట్ సైజ్ ఎంత?: ఖురేషీ కేసులో సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఏపీ సింగ్‌పై కేసు, కోనేరుపైనా..

సీబీఐ మాజీ డైరెక్టర్ అమర్‌ప్రతాప్ సింగ్‌పై ఆ సంస్థ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వివాదాస్పద మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీకి లబ్ధి చేకూర్చారన్న అభియోగాలపై సీబీఐ ఆయనపై కేసు పెట్టింది.

|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్ అమర్‌ప్రతాప్ సింగ్‌పై ఆ సంస్థ సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వివాదాస్పద మాంసం ఎగుమతిదారుడు మొయిన్ ఖురేషీకి లబ్ధి చేకూర్చారన్న అభియోగాలపై సీబీఐ ఆయనపై కేసు పెట్టింది. 2012-12మధ్య కాలంలో ఏపీ సింగ్ సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు.

కాగా, అమర్ ప్రతాప్‌సింగ్‌తో పాటు ఆయన దగ్గర పనిచేస్తున్న ఆదిత్య శర్మ, ట్రైమాక్స్ గ్రూప్ కంపెనీల యజమాని కోనేరు ప్రదీప్‌పై కూడా కేసులు నమోదు చేసింది. వీరికి సంబంధించి న్యూఢిల్లీ, చెన్నై, ఘాజియాబాద్‌, హైదరాబాద్‌లలోని కార్యాలయాలు, ఇతర భవనాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది.

CBI books former chief AP Singh for favouring Moin Qureshi in graft case

ప్రభుత్వోద్యోగుల నుంచి లబ్ధి చేకూర్చేందుకు చాలామంది నుంచి అమర్‌ప్రతాప్‌సింగ్ డబ్బులు తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.

కాగా, ఖురేషీ, ఏపీ సింగ్ మధ్య సందేశాల మార్పిడి జరిగింది. సుమారు 25కు పైగా సందేహాలను ఇరువురు ఒకరికొకరు పంపుకున్నారు. ఓ సందేశంలో 'నీ షర్ట్ సైజ్ ఎంతో అంతే. తొందరగా చెయ్' అంటూ ఖురేషి అడిగిన ప్రశ్నకు ఏపీ సింగ్ బదులు పంపడం గమనార్హం.

ఏపీ సింగ్ ఇళ్లతోపాటు కోనేరు ప్రదీప్ ఇంట్లో కూడా సోదాలు చేశామని అధికారులు పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కూడా కోనేరు ప్రదీప్ నిందితుడుగా ఉన్నారని తెలిపారు.

English summary
The Central Bureau of Investigation (CBI) registered a case against its former director AP Singh on Monday for allegedly providing favours to controversial meat exporter Moin Qureshi, who is an accused in a graft case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X