వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ వాట్సప్ పోర్న్ రాకెట్: 119 మందిపై కేసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) గురువారంనాడు ఛేదించింది. వాట్సప్ గ్రూప్ ద్వారా ఇది నడుస్తోంది. వాట్సప్ గ్రూప్ ఐదుగురు అడ్మిన్‌లపై, 114 మంది సభ్యులపై సిబిఐ కేసులు నమోదు చేసింది.

ఆ గ్రూప్ చైల్డ్ పోర్నోగ్రఫీ సందేశాలను పంపిణీ చేస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఇందుకు సంబంధించి నిఖిల్ వర్మ అనే వ్యక్తి సిబిఐ అరెస్టు చేసింది. ఇతను వాట్సప్ గ్రూప్ అడ్మిన్లలో ఒకడని భావిస్తున్నారు.

CBI busts WhatsApp-based porn racket; 119 people booked

అనుమానితుడు నిఖిల్ వర్మ 20 ఏళ్ల బికాం గ్రాడ్యుయేట్. ట్రాన్సిట్ రిమాండ్‌పై అతన్ని ఢిల్లీకి తరలిస్తారు. "Kids-XXX" పేరుతో ఉన్న గ్రూప్‌లో పోర్నోగ్రాఫిక్ మెటిరీయల్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు.

శ్రీలంక, పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, అమెరికా, మెక్సికో, న్యూజిలాండ్, చైనా, నైజరీయా, బ్రెజిల్, కెన్యా దేశాలకు చెందినవారు ఇందులో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబైల్లోని అనుమానితుల ఆవరణల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది.

English summary
CBI on Thursday busted a multinational child pornography racket being run through a WhatsApp group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X