వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయావతి డిఏ కేసు విచారణ ముగిస్తున్నాం: సిబిఐ

|
Google Oneindia TeluguNews

Mayawati
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సిబిఐ విచారణ నుంచి ఊరటపొందిన కొంతకాలానికే బహుజన్ సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయావతికి కూడా సిబిఐ విచారణ నుంచి విముక్తి కలిగే అవకాశం కనిపిస్తోంది. మాయావతి అక్రమాస్తుల కేసులో విచారణ ముగిస్తున్నట్లు మంగళవారం సిబిఐ వర్గాలు వెల్లడించాయి.

మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆదాయానికి మంచిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. సిబిఐ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణను ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతస్థానంలో ఉన్న రాజకీయ నేతల కేసుల విషయంలో సిబిఐ అనుసరిస్తున్న విచారణ విధానం సరిగా లేదని ఇటీవల సుప్రీం కోర్టు సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటున్నామని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయాపతిపై తాజ్ కారిడార్ కేసుకు సంబంధించిన విచారణను జరపాలని ఆగస్టు 8న కోర్టు తెలిపింది.మాయావతికి సంబంధించిన అక్రమాస్తుల కేసును సమీక్షించాలని కోరుతూ వచ్చిన పిటిషన్‌ను సరైన ఆధారాలు లేకపోవడంతో జస్టిస్ పి సదాశివం, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ తోసిపుచ్చింది.

మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాజ్ కారిడార్ కోసం ప్రభుత్వ ఆమోదం లేకుండా విడుదలైన 17కోట్ల రూపాయలకు సంబంధించి ఆరోపణలు రావడంతో సిబిఐ దానిపై విచారణ జరుపుతోంది. మాయావతి అక్రమాస్తుల విషయంలో సరైనా ఆధారాలు లేకుండా విచారణ కొనసాగిస్తున్న సిబిఐ వైఖరిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మాయావతి అక్రమాస్తుల కేసును ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
After Samajwadi Party (SP) chief Mulayam Singh Yadav, Mayawati will be the next politician to get relief from the CBI, which is reportedly mulling to close the disproportionate assets case against the Bahujan Samaj Party (BSP) supremo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X