వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ములాయం సింగ్‌కు ఊరట: సిబిఐ ఆస్తుల కేసు క్లోజ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు ఊరట లభించింది. ములాయంపై ఆరేళ్లుగా కొనసాగుతున్న కేసును ఆధారాలు లేవన్న కారణంగా శుక్రవారం సిబిఐ మూసివేసింది. ఆధారాలు లేని కారణంగా ములాయం, అతని కుటుంబ సభ్యులపై విచారణను ప్రాథమికంగా నిలిపివేస్తున్నట్లు సిబిఐ ప్రకటించింది.

ఆదాయాలకు మించి ఆస్తులున్నాయని ఆరోపణల నేపథ్యంలో డిసెంబర్ 13న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ములాయం, ఉత్తరపదేశ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భార్య డింపుల్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులపై సిబిఐ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు విచారణను పునర్ ప్రారంభిస్తామని సిబిఐ తెలిపింది.

 Mulayam Singh Yadav

ప్రతీ కేసులోనూ పారదర్శకంగా ఉన్నామని, ఈ కేసులో కూడా అలాగే వ్యవహరిస్తున్నామని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తెలిపారు. 2007 ప్రాథమిక విచారణ ప్రారంభమైందని, కొన్ని లొసుగులు, రివ్యూ పిటిషన్ల కారణంగా కేసులో పురోగతి లేదని సిబిఐ తెలిపింది.

2007లో ప్రారంభమైన ప్రాథమిక విచారణలో ములాయం పేరు రాలేదని, ములాయం, ఆయన కుమారులు అఖిలేష్, ప్రతీక్, కోడలు డింపుల్ యాదవ్ లకు సంబంధించిన మొత్తం ఆస్తి 2.63కోట్లు ఉన్నట్లు తమ లెక్కలలో తేలిందని సిబిఐ పేర్కొంది. ఇదంతా 2012 డిసెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత జరిగింది.

English summary
In a big relief to Samajwadi Party chief Mulayam Singh Yadav, the CBI on Friday closed a six-year-old disproportionate assets case against him citing lack of evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X