బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీకే బ్రదర్స్ కు గంటల్లో షాక్: కర్ణాటకలో ఐదు చోట్ల సీబీఐ సోదాలు, కాంగ్రెస్ లో కలవరం, ప్రభుత్వం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలకపాత్ర పోషించిన డీకే.శికుమార్ కు సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. డీకే. శివకుమార్ బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.

అత్యవసర సమావేశం

అత్యవసర సమావేశం

తమ మీద సీబీఐ, ఈడీ అధికారులతో దాడులు చేయించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నుతుందని గురువారం ఉదయం మీడియా సమావేశంలో మాజీ మంత్రి డీకే. శివకుమార్, ఆయన సోదరుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ ఆరోపణలు చేసిన మూడు గంటల తేడాలో సీబీఐ సోదాలు ముమ్మరం చేసింది.

ఐదు ప్రాంతాల్లో సోదాలు

ఐదు ప్రాంతాల్లో సోదాలు

డీకే. శివకుమార్, డీకే. సురేష్ సన్నిహితులు, బంధులకు చెందిన బెంగళూరు, కనకపుర, రామనగర తదితర ఐదు ప్రాంతాల్లోని నివాసాలు, కార్యాలయాల్లోని సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. అక్రమంగా నగదు బదిలీ చేశారని సమాచారం అందడంతో సీబీఐ సోదాలు చేస్తోందని సమాచారం.

11 మంది టార్గెట్

11 మంది టార్గెట్


గురువారం ఉదయం బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని నివాసంలో అత్యవసర విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డీకే. శివకుమార్, డీకే. సురేష్ సోదరులు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు 11 మందిని టార్గెట్ చేసుకుని నాలుగు రోజుల్లో సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ దాడులు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన నాలుగు గంటల వ్యవదిలోనే సీబీఐ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు.

ఒక్క రోజు ముందు కోర్టుకు

ఒక్క రోజు ముందు కోర్టుకు


డీకే. శివకుమార్, ఆయన కుటుంబ సభ్యుల మీద ఐటీ శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీ. పాటిల్ నేతృత్వంలోని బెంచ్ ముందు డీకే. శివకుమార్ హాజరైనారు.

సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం

సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశం

బెంగళూరు నగరంలోని సీబీఐ 82వ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పుష్పాంజలి దేవీ సీబీఐ అధికారులకు సెర్చ్ వారెంట్లు జారీ చేశారు. సీబీఐ సెర్చ్ వారెంట్లలో డీకే. శివకుమార్, ఆయన సోదరుడు డీకే. సురేష్ పేర్లు లేవని సమాచారం. అయితే డీకే. శివకుమార్ సన్నిహితుల పేర్లు ఉన్నాయి వెలుగు చూసింది.

English summary
Central bureau of investigation (CBI) officials conducted raid at former Karnataka energy minister DK Shivakumar's associate’s residences in Bengaluru, Kanakapura and Ramanagara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X