వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పని కష్టాలు: ఈడీ కస్టడీకి అప్పగించాలన్న చిదంబరం పిటిషన్‌ను తిరస్కరించిన సీబీఐ కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి చిదంబరంను చిక్కులు ఇప్పుడప్పుడే వీడేలా లేవు. ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న చిదంబరం, తనను ఈడీ కస్టడీకి అప్పగించాలంటూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణ చేసింది. అయితే ఈడీకి చిదంబరంను అప్పగించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సెప్టెంబర 19 వరకు తీహార్ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన ఈడీ తనను విచారణ చేయాలని పేర్కొంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చిదంబరం. ఈడీ తరపున గురువారం వాదనలు వినిపించారు సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా. చిదంబరం పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా ఆయన తన వాదనలు వినిపించారు.ఇప్పుడప్పుడే ఈడీ చిదంబరంను కస్టడీకి తీసుకోదల్చుకోలేదని తీహార్ జైలులో ఉన్న సమయంలో ఈడీ తన సొంత విచారణ చేస్తోందని కోర్టుకు తెలిపారు తుషార్ మెహతా. సరైన సమయంలో చిదంబరం కస్టడీలోకి తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున ఆయన ప్రత్యక్ష సాక్షులను కానీ ఇతర రుజువులను కానీ ప్రభావితం చేయలేరని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు తుషార్ మెహతా.

CBI court rejects Chidambarams plea to surrender him to ED

ఇక ఎప్పుడు అరెస్టు కావాలో నిర్ణయించే అధికారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారకి లేదని స్పష్టం చేశారు తుషార్ మెహతా. చిదంబరం అరెస్టు కావడం అవసరమే అదే సమయంలో ఎప్పుడు అరెస్టు చేయాలో అన్నది ఈడీకి సూచించలేరని చెప్పారు. ఆగష్టు 21న చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియాల కేసులో అరెస్టు చేయడం జరిగింది. విచారణ కోసం సీబీఐ కస్టడీకి తీసుకోవడం జరిగింది. గతవారమే చిదంబరంను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలంటూ అంతవరకు అంటే సెప్టెంబర్ 19 వరకు తీహార్‌ జైలులో ఉంచాలని ఆదేశించడం జరిగింది.

English summary
A special Central Bureau of Investigation (CBI) court on Friday rejected former Finance Minister P Chidambaram's plea to surrender to the Enforcement Directorate (ED) in the INX Media corruption case. Chidambaram, who is lodged in Tihar, will continue his stay in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X