వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ రుణాలు ఎగవేత దారులకు చెక్..! దేశవ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: బ్యాంకు రుణాలను ఎగ్గొట్టే వారి పట్ల సీబీఐ కొరడా ఝళిపించబోతోంది. 1,139 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ భారీ డ్రైవ్‌ చేపట్టింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 12 రాష్ట్రాల్లోని 18 నగరాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 61 చోట్ల సోదాలు చేపట్టింది. ఎస్‌బీఐ, సెంట్రల్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైన 17 కేసులకు సంబంధించిన వివిధ వాణిజ్య సంస్థల డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన ఇళ్లు, సంస్థలపై దాడులు జరిగాయి. పరారైన వజ్రాల వ్యాపారి జతిన్‌కి చెందిన ముంబైలోని విన్‌సమ్‌ గ్రూప్, తాయల్‌ గ్రూప్‌నకు చెందిన ఎస్కే నిట్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నఫ్తోగజ్, ఎస్‌ఎల్‌ కన్జ్యూమర్, పంజాబ్‌లోని ఇంటర్నేషనల్‌ మెగా ఫుడ్‌పార్క్, సుప్రీం టెక్స్‌ మార్ట్‌ తదితరాలు లక్ష్యంగా సోదాలు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది.

CBI crackdown on loan defaulters..!

గృహ రుణాల మంజూరులో అవకతవకలకు పాల్పడిన భువనేశ్వర్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ శాఖ అధికారులపై మూడు కేసులు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ముంబై, థానే, లూ«థియానా, వల్సాద్, పుణే, గయ, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్‌ తదితర నగరాల్లో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది అధికారులు పాల్గొన్నారని తెలిపింది. సీబీఐ డైరెక్టర్‌ రిషి కుమార్‌ శుక్లా నేతృత్వంలో చేపట్టిన తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని సీబీఐ పేర్కొంది. 640 కోట్ల రూపాయల మేర మోసం జరిగి ఉంటుందని అంచనా వేసిన అధికారులు సోదాల తర్వాత ఈ మొత్తం 1,139 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తేల్చారు. ఈ మేరకు జితిన్‌ మెహతాపై 16వ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎగ్జిమ్‌ బ్యాంకును 202 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఇతనిపై ఇప్పటికే పలు కేసులున్నాయి. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబైలోనూ అధికారులు సోదాలు కొనసాగించారు.

English summary
CBI has taken a huge step in the case of fraud of banks worth Rs 1,139 crore. It has conducted 61 locations in 18 cities and union territories in 12 states simultaneously across the country. The complaints filed by banks, including SBI, Central Bank, Corporation Bank, Union Bank, Bank of Baroda and others, have been the subject of a series of raids on the homes and institutions belonging to the directors and promoters of various commercial enterprises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X