• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల వేళ విపక్షాలపై కేంద్ర సంస్ధల పంజా- తర్వాత గప్‌చుప్‌- బీజేపీలో చేరితే ఓకే

|

2014లో నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ, ఐటీ, డీఆర్ఐ విపక్ష నేతల్ని టార్గెట్‌ చేస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలోనే జరుగుతున్న ఈ దాడులు, దర్యాప్తులు ఆ తర్వాత మాత్రం మూలనపడిపోతున్నాయి. ఓసారి ఎన్నికలు ముగిశాక సదరు దర్యాప్తులతో అవసరం తీరిపోయిందని కేంద్ర దర్యాప్తు సంస్ధలు భావిస్తున్నాయా ? లేక అధికార పార్టీ రాజకీయ అవసరాల కోసం ఇవి విపక్షాలను టార్గెట్‌ చేస్తున్నాయా అన్న చర్చ దేశంలో ఊపందుకుంటోంది.

 ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర సంస్ధల పంజా

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర సంస్ధల పంజా

ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతన్నాయి. వీటిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పశ్చిమబెంగాల్‌, అస్సోం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా కనిపిస్తోంది. అలాగే తమిళనాడులో వీలైనన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్ధలు విపక్షాల్ని, విపక్ష నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపడుతున్నాయి. వీటిపై విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.

కేంద్ర సంస్ధల దాడుల తీరిదే

కేంద్ర సంస్ధల దాడుల తీరిదే

ఏప్రిల్‌ 2న తమిళనాడులో డీఎంకే సీఎం అభ్యర్ధి ఎంకే స్టాలిన్‌ కుమార్తె సెంథమరై నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. ఫిబ్రవరి 21న పశ్చిమబెంగాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఇళ్లలో సీబీఐ దాడులు నిర్వహించింది. ఏడాది క్రితం నాటి బొగ్గు కేసులో అభిషేక్‌ భార్య, మేనకోడలికి కూడా విచారణకు రావాలని సమన్లు పంపింది.

ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఆయన మేనల్లుడు అజిత్‌ పవార్‌కు సహకార బ్యాంకు స్కాం కేసులో ఈడీ మనీలాండరింగ్‌ కేసులు నమోదు చేసింది. కేరళలో ఎన్నికలకు ముందు సీఎం పినరయ్‌ విజయ్‌ చుట్టూ ఉన్న వారిపై బంగారం స్కామ్‌లో ఈడీ కేసులు పెట్టింది. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు గుప్కార్‌ అలయన్స్‌ స్దాపించగానే ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి వారిపై వేధింపులు మొదలయ్యాయి.

గతేడాది కర్నాటకలో కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌పైనా సీబీఐ దాడులు నిర్వహించి పలు కేసులు నమోదు చేసింది. రాజస్ధాన్‌ ప్రభుత్వంలో సంక్షోభ సమయంలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సోదరుడిపై ఈడీ దాడులు చేసింది.

ఎన్నికల వేళ విపక్షాల టార్గెట్‌

ఎన్నికల వేళ విపక్షాల టార్గెట్‌

దేశంలో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని గమనిస్తే కేంద్రం తన చేతిలో ఉన్న సీబీఐ, ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్ధల సాయంతో విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. పాత కేసుల్ని తిరగతోడి సమన్లు జారీ చేయడం, తనిఖీలు చేపట్టడం, అరెస్టులు చేయడం సర్వసాధారణంగా మారుతోంది. అయితే వీటిలో నిర్దిష్టమైన ఆధారాల్ని సంపాదించడంలో మాత్రం దర్యాప్తు సంస్ధలు విఫలమవుతున్నాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్ధల చర్యలు ఎన్నికల రాజకీయంలో భాగంగా మిగిలిపోతున్నాయి.

బీజేపీలో చేరిన వారిని చూసీ చూడనట్లుగా..

బీజేపీలో చేరిన వారిని చూసీ చూడనట్లుగా..

ఎన్నికల వేళ విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్ధలు.. ఆయా నేతలు తిరిగి బీజేపీ చేరితే మాత్రం వారిపై దర్యాప్తును నెమ్మదిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క పశ్చిమబెంగాల్లోనే శారదాస్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ తృణమూల్‌ నేత ముకుల్‌ రాయ్‌ బీజేపీలో చేరగానే ఆయనపై సీబీఐ దర్యాప్తు నెమ్మదించింది. తృణమూల్‌ పార్టీకే చెందిన సువేందు అధికారి, సోవన్‌ ఛటర్జీ వంటి వారి విషయంలోనూ దర్యాప్తు సంస్ధల ధోరణి ఇలాగే ఉంది. ఏపీలోనూ ఇదే పరిస్ధితి. గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఎన్నికైన వారికి సమన్లు పంపిన దర్యాప్తు సంస్ధలు.. ఇప్పుడు వారి విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి.

English summary
Under Modi govt, there are many instances of these central agencies questioning or raiding opposition leaders when it can have political consequences. Later, probes go cold again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X