వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు రాను! విచారణకు సహకరించను: సీబీఐకి తేల్చి చెప్పిన నీరవ్ మోడీ

|
Google Oneindia TeluguNews

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంపై విచారణకు సహకరించాలని ఆయనను సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్, నెవిస్‌లో ఉన్న ఆయనకు సీబీఐ ఈ-మెయిల్ ద్వారా ఈ పిలుపునిచ్చింది.

అయితే, నీరవ్ మోడీ మాత్రం తాను భారత్‌కు రాలేనని స్పష్టం చేశారు. అంతేకగా, 'మాకు విదేశాల్లో వ్యాపారాలున్నాయి, అందువల్ల నేను దర్యాప్తులో పాల్గొనలేను. భారత్‌కు రాలేను' అని నీరవ్ మోడీ తేల్చి చెప్పారు.

 CBI Emails Nirav Modi, He Refuses To Join Investigation

నీరవ్ స్పందనపై సీబీఐ ప్రతిస్పందిస్తూ మరొక ఈ-మెయిల్‌ను ఆయనకు పంపించింది. 'మీరు ఉన్న దేశంలోని హై కమిషన్‌ను సంప్రదించండి. మీ ప్రయాణానికి సీబీఐ ఏర్పాట్లు చేస్తుంది' అని తెలిపింది. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే దర్యాప్తులో తప్పనిసరిగా పాల్గొనాలని పేర్కొంది. దీనికి ఆయన నుంచి స్పందన రావాల్సి ఉంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణం కేసులో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడు. రూ.11,400 కోట్ల మేరకు ఆయన మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నాయి.

English summary
Jeweller Nirav Modi has refused to join a CBI investigation into an alleged fraud involving his companies and the country's second biggest state lender, Punjab National Bank, officials of the investigating agency said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X