సీబీఐ 'పాన్ షాప్' లా మారింది ..బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఇలా .. మహారాష్ట్ర మంత్రి సంచలనం
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి హయాంలో సీబీఐ పాన్ షాప్ లా మారిందని మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు . సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన అధికార పరిధిలోనే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వం ఇప్పటికే బీజేపీపై ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడుతుంది. ఇక తాజాగా సీబీఐ దర్యాప్తు విషయంలోనూ తమ అనుమతి లేకుంటే రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో సుప్రీం తాజా నిర్ణయం మహా సర్కార్ కు, మంత్రులకు ఆయుధంగా మారింది.
బీహార్ విద్యాశాఖామంత్రి ఔట్ .. అవినీతి ఆరోపణలతో మంత్రి అయిన గంటన్నర లోపే రాజీనామా

సీబీఐ దర్యాప్తుకు రాష్ట్రాల అనుమతి తప్పనిసరి , ప్రత్యేకాధికారం లేదు
దేశంలోని ఏ రాష్ట్రాలలో అయినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తనపని చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయిందని, సీబీఐకి ప్రత్యేక అధికారం లేదని ఆయన చెప్పారు. సిబిఐ ఎక్కడికైనా వెళుతుంది, ఎవరినైనా బుక్ చేస్తుందని మాట్లాడిన మహారాష్ట్ర టెక్స్ టైల్ మంత్రి అస్లాం షేక్ , ముఖ్యంగా ప్రస్తుతం సిబిఐ బీజేపీయేతర పరిపాలన సాగిస్తున్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులను టార్గెట్ చేస్తుందని పేర్కొన్నారు. సీబీఐ కేవలం బీజేపీయేతర రాష్ట్రాలను టార్గెట్ చేసి కావాలని వేధిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించామని చెప్పిన ఆయన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక నుండి దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవటం తప్పనిసరి అని ఈ వ్యాఖ్యలు చేశారు.

సుప్రీం ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ ను స్వాగతించిన మంత్రి అస్లాం షేక్
గురువారం ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం రాష్ట్రాల పరిధిలో సిబిఐ దర్యాప్తునకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయా రాష్ట్రాల నుంచి అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఆ మేరకు గురువారం రూలింగ్ ఇచ్చింది . రాష్ట్రాల పరిధిలో సిబీఐ సంస్థ దర్యాప్తు అంశాలు, నిర్దేశిత నిబంధనలు అన్నీ రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలకు అనుగుణంగానే ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎటువంటి దర్యాప్తు అయినా సరే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తర్వాతనే చేపట్టాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం రూలింగ్ ను మంత్రి అస్లాం షేక్ స్వాగతించారు .

కేంద్ర దర్యాప్తు సంస్థ అధికార పరిధి పరిమితమే .. సుప్రీం రూలింగ్ కు ప్రాధాన్యత ఇందుకే !!
రాష్ట్రాల అనుమతి లేకుండా, కేంద్ర దర్యాప్తు సంస్థ అధికార పరిధిని విస్తరించలేమని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లో జరిగిన అవినీతి కేసులో నిందితుల పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ఎ ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్రాల అనుమతి లేకుండా దర్యాప్తు చేయలేమని రూలింగ్ ఇవ్వడంతో మహారాష్ట్ర మంత్రి సిబిఐ పై సంచలన చేశారు.
ఇటీవల పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, మరియు చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో సిబిఐ దర్యాప్తుకు తమ "సాధారణ సమ్మతిని" ఉపసంహరించుకోవడంతో , తప్పనిసరిగా అనుమతి తీసుకొని రాష్ట్రానికి ప్రవేశించాలని తేల్చడంతో ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం ఇచ్చిన రూలింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది.