వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఎంసీ,బీజేపీ కోల్గ్‌వార్... శారదా చిట్స్ కుంభకోణంలో ఉచ్చు బిగిస్తున్న సీబీఐ

|
Google Oneindia TeluguNews

శారదా కుంభకోణం ఆరోపణలు ఎదుర్కోంటున్న కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ పై సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. ఈనేపథ్యంలోనే రాజీవ్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుక్‌అవుట్ నోటీస్ జారీ చేసింది. కాగా ఇప్పటికే తనను చిట్‌ఫండ్ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాజీవ్ కుమార్ కోర్టులో అఫిడవిట్ సైతం దాఖలు చేశాడు.

పశ్చిమబెంగాల్, కేంద్ర ప్రభుత్వం మధ్య చిచ్చురేపుతున్న శారద చిట్‌ఫండ్ కుంభకోణం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అప్పటి కొల్‌కతా పోలీస్ కమీషనర్‌గా ఉన్నరాజీవ్ కుమార్‌ మాయం చేశాడిని సీబీఐ ఉచ్చు ఆరోపణలు చేస్తోంది. దీంతో ఆ కేసుకు సంబంధించి విచారణ జరుపుతుండడంతో రాజీవ్ కుమార్‌పై ఉచ్చు బిగిస్తోంది సీబీఐ

CBI issue lookout notice against rajeev kumar

ఈనేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ చూస్తుందంటూ రాజీవ్ కుమార్ ముందస్తుగా కోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేశారు. దీంతో ఆయన అరెస్ట్‌కు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి పోకుండా లుక్ అవుట్ నోటీస్‌ను జారీ చేసింది. కాగా సీబీఐ శారదా కుంభకోణానికి సంబంధించి సీబీఐ 2014 నుండి విచారణ చేపట్టింది. ఇందులో సుమారు 3500 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.

English summary
CBI issued lookout notice against former kolkata police commissioner rajeev kumar in connection with sharada chit fund scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X