వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ కేసుల్లో గుర్మీత్ రామ్ రహీంకు జైలుశిక్ష: జడ్జికి జడ్ ఫ్లస్ భద్రత, ఎన్ఎస్ జీ కమాండోలు !

సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ కు జడ్ ఫ్లస్ (Z+) భద్రత కల్పించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ కు జడ్ ఫ్లస్ (Z+) భద్రత కల్పించారు. వివాదాస్పద మతగురువు గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను 20 ఏళ్లు జైలుకు పంపించిన న్యాయమూర్తి జగదీప్ సింగ్ కు ప్రాణహాని ఉందని వెలుగు చూడటంతో ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు రెండు రేప్ కేసుల్లో విచారణ పూర్తి చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్ 20 ఏళ్లు జైలు శిక్ష విధించారు. గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను జైలుకు పంపించిన మిమ్మల్ని చంపేస్తామని ఆయన అనుచరులు న్యాయమూర్తికి బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు.

CBI judge who convicted Gurmeet Ram Rahim singh given Z plus security

విషయం తెలుసుకున్న ఇంటిలిజెన్స్ అధికారులు న్యాయమూర్తి జగదీప్ సింగ్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం, హర్యాన ప్రభుత్వానికి సూచించింది. న్యాయమూర్తి జగదీప్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులకు కు జడ్ ఫ్లస్ భద్రత కల్పించారు.

55 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు 10 మంది ఎన్ఎస్ జీ కమాండోలను నియమించారు. న్యాయమూర్తి ఇంటి దగ్గర స్థానిక పోలీసులు కట్టుదట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తి జగదీప్ ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అటు వైపు వచ్చి వెలుతున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

English summary
Special CBI judge Jagdeep Singh, who recently convicted Gurmeet Ram Rahim in two rape cases, has been given Z+ security. A total of 55 policemen, and 10 NSG commandos will be given to him and his family, after they repeatedly received threat calls from Dera followers. Jagdeep Singh sentenced the Dera chief to 20 years in prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X