వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకింగ్ మోసాలపై సీబీఐ నజర్.. 12 రాష్ట్రాల్లో సోదాలు.. 14 కేసులు నమోదు..

|
Google Oneindia TeluguNews

బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. 12 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు జరుపుతోంది. 18 నగరాల్లోని 50 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించిన బ్యాంకు మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివిధ కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది.

CBI Launches Special Drive Against Banking Fraud

ఢిల్లీ, ముంబై, లుథియానా, థానే, వల్సాద్, పూనే, పలానీ, గయ, గురుగ్రామ్, ఛండీఘడ్, భోపాల్, సూరత్, కోలార్ తదితర ప్రాంతాల్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దాడుల అనంతరం రూ.640 కోట్ల నిధుల గోల్ మాల్‌కు సంబంధించి సీబీఐ వివిధ కంపెనీలు, వాటి ప్రమోటర్లు, బ్యాంకు అధికారులపై 14 కేసులు నమోదు చేసింది. పలు ప్రాంతాల్లో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

English summary
The CBI launched a special drive in connection with banking scams across the country and registered 14 cases. The agency teams swooped down at 50 locations in 18 different cities in a coordinated action against the promoters and directors of the companies made accused in the cases in 12 states across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X