CBI: అవినీతి, అక్రమాలు, మాజీ హోమ్ మంత్రికి సినిమా చూపించిన సీబీఐ, హైకోర్టులో నో బెయిల్, దెబ్బకు !
ముంబాయి/న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ విషయంలో విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు బుధవారం ఆయన్ను అరెస్టు చేశారు. గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఈడీ అధికారులు మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అధికారులు అనీల్ దేశ్ ముఖ్ ను మరోసారి అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

అక్రమ నగదు లావాదేవీలు కేసులో ఈడీ ఎంట్రీ
అక్రమంగా నగదు లావాదేవీలు జరిపారని ఆరోపిస్తూ 2021 నవంబర్ నెలలో మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈడీ అధికారులు అరెస్టు చేసిన మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యడానికి ముంబాయి సెషన్స్ కోర్టు సీబీఐ అధికారులకు అవకాశం ఇచ్చింది.

బెయిల్ కోసం ప్రయత్నించిన మాజీ హోమ్ మంత్రి
ముందస్తు బెయిల్ కోసం మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ కు ముందుస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణ తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, ఆయన సాక్షులను ప్రబావితం చేసే అవకాశం ఉంటుందని, బెయిల్ మంజూరు చెయ్యకూడదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు మనవి చేశారు.

బెయిల్ ఇవ్వలేమని చెప్పిన హైకోర్టు
వాదనలు విన్న బాంబే హైకోర్టు మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ కు మందస్తు బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించింది. ఇదే కేసుకు సంబంధించి ముంబాయి సెషన్స్ కోర్టు కూడా అనీల్ దేశ్ ముఖ్ కు మందస్తు బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించింది.

ముంబాయి మాజీ సిటీ పోలీసు కమీషనర్ దెబ్బ
ముంబాయి మాజీ పోలీసు కమీషనర్ పరమ్ వీర్ సింగ్ అప్పటి మహారాష్ట్ర హోమ్ మంత్రిగా ఉన్న అనీల్ దేశ్ ముఖ్ కోట్ల రూపాయాలు మామూళ్లు వస్తున్నారని ఆయన మీద అవనీతి ఆరోపణలు చేశారు. ముంబాయి మాజీ పోలీసు కమీషనర్ పరమ్ వీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేసిన తరువాత అనీల్ దేశ్ ముఖ్ ను హోమ్ మంత్రి పదవి నుంచి తప్పించారు, గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన ఈడీ అధికారులు మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ను అరెస్టు చేశారు. ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ అధికారులు అనీల్ దేశ్ ముఖ్ ను అరెస్టు చెయ్యడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఉలిక్కిపడ్డారు.