వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగేశ్వరరావుకు సుప్రీం దెబ్బ.. లక్ష ఫైన్, మూలన కూర్చోవాలని ఆదేశం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయన తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేగాకుండా కోర్టు సమయం ముగిసేంతవరకు ఓ మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. అత్యున్నత స్థాయి అధికారుల విషయంలో గతంలో ఎన్నడూ ఇలాంటి శిక్షలు వేసిన దాఖలాలు లేవు. ఆ కేసుకు సంబంధించి క్షమాపణ చెబుతూ నాగేశ్వరరావు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీంకోర్టు జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుకు కట్టుబడి నాగేశ్వరరావు మంగళవారం కోర్టులోనే ఉండాల్సి వస్తుంది.

 ఊహించని దెబ్బ

ఊహించని దెబ్బ

సీబీఐ అధికారి నాగేశ్వరరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ రేప్ కేసు దర్యాప్తు చేసిన సీనియర్ అధికారి ఏకే శర్మను బదిలీ చేసిన విషయంలో నాగేశ్వర రావు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేగాకుండా తమ అనుమతి లేకుండా శర్మను బదిలీ చేయొద్దని సుప్రీంకోర్టు రెండుసార్లు ఆదేశించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను నాగేశ్వరరావు బేఖాతరు చేశారని.. ఇటీవల నోటీసులు జారీచేసింది.

కోర్టులను గౌరవిస్తా..!

కోర్టులను గౌరవిస్తా..!

ఏకే శర్మను బదిలీ చేయడం తప్పేనంటూ అంగీకరించిన నాగేశ్వరరావు.. ఆమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి వచ్చేంతవరకు ఆగాల్సింది పోయి తొందర పడ్డానంటూ పేర్కొన్నారు. కోర్టులంటే తనకు గౌరవముందని, కలలో కూడా న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘించబోనంటూ అఫిడవిట్ లో రాశారు. ఆ మేరకు సర్వోన్నత న్యాయస్థానాన్ని బేషరతు క్షమాపణ కోరారు.

బలయ్యాడా? బలి చేశారా?

బలయ్యాడా? బలి చేశారా?

నాగేశ్వరరావు దాఖలు చేసిన అఫిడవిట్ ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ఆయన పట్టించుకోలేదని శిక్ష ఖరారు చేసింది. జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం లక్ష రూపాయల జరిమానా విధించింది. అంతేగాకుండా కోర్టు సమయం ముగిసేంత వరకు ఓ మూలన కూర్చోండంటూ తీర్పు చెప్పింది. దాంతో మంగళవారం కోర్టు ముగిసేంతవరకు నాగేశ్వరరావు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. తెలంగాణకు చెందిన నాగేశ్వరరావు ఇటీవల సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులయ్యారు. సీబీఐ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆయన పదవి మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా నాగేశ్వరరావు స్వార్థ రాజకీయాలకు బలయ్యారా? అనే చర్చ జరుగుతోంది.

English summary
CBI ex chief Nageshwara Rao is in trouble. The Supreme Court has imposed a penalty of Rs. one lakh. the court ordered to sit at one corner until the end of the court. There have been no such penalties in the past for the highest level officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X