వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు: చిదంబరం, కార్తీలను నిందితులుగా పేర్కొన్న సీబీఐ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంకు భారీ షాక్ తగిలింది. వీరిద్దరి పేర్లను ఎయిర్‌సెల్ మాక్సిక్ మనీలాండరింగ్ కేసులో నిందితులుగా చేర్చింది సీబీఐ. చిదంబరం, కార్తీతోపాటు 9మంది ప్రభుత్వ, ఎయిర్‌సెల్ మాక్సిస్ అధికారుల పేర్లను తీసుకోనుంది.

గురువారం పటియాలా హౌజ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. నెల రోజుల కిందటే ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జీ షీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 CBI names P Chidambaram as accused in Aircel-Maxis case

చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ ఛార్జీషీటులో పేర్కొంది. నిబంధనలను మార్చి ఎయిర్‌సెల్‌లో గ్లోబల్ కమ్యూనికేషణ్ హోల్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టేలా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ) క్లియరెన్స్ ఇచ్చారని సీబీఐ తెలిపింది.

కాగా, ఈ కేసులో చిదంబరాన్ని నిందితుడిగా పేర్కొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీటులో చిదంబరం పేరును పలుమార్లు ప్రస్తావించినా.. ఎక్కడా ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు.

English summary
The Central Bureau of Investigation has named former union minister, P Chidambaram as an accused in the Aircel-Maxis case. His name was mentioned in the supplementary chargesheet filed by the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X