వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ‌ అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ గా మరోసారి పదవీబాధ్యతలు స్వీకరించారు. అయితే ఉన్నతస్థాయి కమిటీ అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ ముందస్తు చర్యలు తీసుకుంది. ఈనేపథ్యంలో గురువారం రాత్రి సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. బలగాలను మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు.

అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ.. తాత్కాలికంగా మన్నెం నాగేశ్వరరావును నియమించింది కేంద్రం. కొత్త డైరెక్టర్ వచ్చేంతవరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు విడుదలయ్యేవరకు ఆయనే ఈ పదవిలో కొనసాగనున్నారు.

cbi office under police control.. temporary director appointed

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావు.. తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యమున్న నాగేశ్వరరావు కెరీర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.

English summary
cbi office under police control.. temporary director appointed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X