వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలివిగా వ్యవహరించారు. డిడిలు తీశారు, రద్దు చేశారు, సిబిఐ ఉచ్చులో చిక్కుకొన్నారు

తెలివిని ఉపయోగించి నల్ల ధనాన్ని మార్పిడిచేసుకొనేందుకు ప్రయత్నించిన వ్యాపారి ఆయన కొడుకును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ అగరుబత్తీల కంపెనీ యజమాని ఆయన కొడుకు బజాజ్ ఫైనాన్స్ పేరు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనాన్ని మార్చుకొనేందుకు అక్రమార్కులు అనేక వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. తెలివిగా వ్యవహారిస్తూ నల్ల ధనాన్ని మార్చుకొంటున్నారు. డిడిలను ఉపయోగించి నల్లధనాన్ని మార్చుకొన్న వ్యాపారుల ఉదంతం ఒకటి కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది.

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని ఓంకార్ పరిమిళ మందిర్ పేరిట అగర్ బత్తీల కంపెనీ ఉంది. దీనికి గోపాల్ డైరెక్టర్ గా ఉన్నారు. అతని కుమారుడు అశ్విన్ సుంకు కకూడ ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే డిసెంబర్ 15 నుండి 18 మద్య కాలంలో బసవగుండి సెంట్రల్ బ్యాంక్ బ్రాంచీలో బజాజ్ ఫైనాన్స్ పేరిట సుమారు 70 లక్షల డిడిని తీశారు.

 cbi officers arrest business man and his son in karnataka

ఈ డిడిల కోసం రద్దుచేసిన నగదును ఉపయోగించారు. అయితే ఈ డిడిలను రద్దుచేసుకొన్నారు. పాత నగదు నోట్ల స్థానంలో బ్యాంకు అధికారులు వారికి 70 లక్షల కొత్త కరెన్సీని ఆచ్చారు. తమ తెలివిని ఉపయోగించి వారు పాత నగదు స్థానంలో కొత్త నగదును తీసుకొన్నారు.

డిడిల కోసం నగదు తీసుకోవడం లేదు. నేరుగా ఖాతాదారుడి ఖాతా నుండే నగదును తీసుకొంటున్నారు. నిబంధనలు ఇలా ఉంటే వీరు మాత్రం నిబంధనలను అతిక్రమించారని బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన సిబిఐ అధికారులు కంపెనీ డైరెక్టర్ గోపాల్ తో పాటు అతని కొడుకు సుంకును కూడ అదుపులోకి తీసుకొన్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని తేలడంతో సిబిఐ అధికారులు అతణ్ణి కూడ విచారిస్తున్నారు.

English summary
a karntaka business man exchange old currency notes with excellent an idea. omkar owner of doopstick company. his son also working in same company. this month between 15 to 18 they they take 70 lakh a demad drafts on bajaj finance , after two days they cancel these d.d.s. bank give them 70 lakh new currency, cbi officers arrest onker and his son,bank manager also custiody in cbi,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X