బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ ఇంటిలో సీబీఐ దాడులు, ఫోన్ ట్యాపింగ్ దెబ్బ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ఇంటిలో గురువారం సీబీఐ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ఇంటిలో సోదాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ మెడకు చుట్టుకుంది.

అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!అల్లుడి రాసలీలలు: అత్తపై మోజుతో కూతురుతో పెళ్లి , వీడియో వైరల్!

బీజేపీ లీడర్స్, సినీ స్టార్స్

బీజేపీ లీడర్స్, సినీ స్టార్స్

గతంలో హెచ్.డీ. కుమారస్వామి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా అలోక్ కుమార్ పని చేశారు. కుమారస్వామి సీఎంగా పని చేసిన సమయంలో అనేక మంది ప్రముఖు రాజకీయ నాయకులు, సినీ తారలు, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని ఆరోపణలు రావడంతో బీజేపీ ప్రభుత్వం కేసు సీబీఐకి అప్పగించింది.

సీబీఐ దెబ్బ

సీబీఐ దెబ్బ

ఇప్పటికే ఈ కేసులో అనేక మంది పోలీసు అధికారులను విచారణ చేసిన సీబీఐ అధికారులు గురువారం అలోక్ కుమార్ ఇంటిలో సోదాలు చేస్తున్నారు. పెన్ డ్రైవ్, హార్డ్ డ్రైవ్ తదితర వస్తువుల కోసం సీబీఐ అధికారులు అలోక్ కుమార్ ఇంటిలో సోదాలు చేస్తున్నారని తెలిసింది.

 ఫోన్ ట్యాపింగ్

ఫోన్ ట్యాపింగ్

ఇంటిలో దాడులు చేసిన సీబీఐ అధికారులు అలోక్ కుమార్ ను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ప్రస్తుత బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఇటీవల వెలుగు చూసింది.

బెంగళూరు కమిషనర్

బెంగళూరు కమిషనర్

బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావ్ ఓ ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మాట్లాడుతున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని వెలుగు చూడటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అలోక్ కుమార్ కు సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి.

ఆడుగోడి టెక్నికల్ టీం

ఆడుగోడి టెక్నికల్ టీం

ఆడుగోడిలోని టెక్నికల్ విభాగం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ పెన్ డ్రైవ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఇచ్చారని సీబీఐ అధికారులు అంటున్నారు. కుమారస్వామీ సీఎంగా ఉన్న సమయంలో అప్పటి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అలోక్ కుమార్ ను బదిలీ చేసి ఆ స్థానంలో భాస్కర్ రావ్ ను నియమించారు.

English summary
Bengaluru: CBI officials raids on IPS officer Alok Kumar's residence. This raid is related to phone tapping case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X