వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

420 కేసు: శేఖర్ రెడ్డి ఫ్రెండ్స్ ను అరెస్టు చేసిన సీబీఐ

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే నాయకులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా అక్రమంగా వ్యాపారం చేసి ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు ఎగనామం పెట్టిన శేఖర్ రెడ్డి కథ అడ్డం తిరిగింది. శేఖర్ రెడ్డికి సహకరించిన అతని బంధువులు, స్నేహితులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

గురువారం శేఖర్ రెడ్డి బంధువు ప్రేమ్ రెడ్డి, స్నేహితులు రతినం, రామచంద్రన్ లను సీబీఐ అదికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే శేఖర్ రెడ్డి మీద ఐపీసీ సెక్షన్ 420 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జయకు సన్నిహితుడైన సీఎస్ కు శేఖర్ రెడ్డికి లింక్: బినామినా ?జయకు సన్నిహితుడైన సీఎస్ కు శేఖర్ రెడ్డికి లింక్: బినామినా ?

అక్రమంగా వ్యాపారం చేసి వందల కోట్ల రూపాయల విలువైన బంగారం, బ్లాక్ మనీ దాచి పెట్టుకున్నారని సమాచారం రావడంతో శేఖర్ రెడ్డితో పాటు అతని బంధువులు, స్నేహితుల నివాసాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు.

CBI police arrested Sekar reddy's friends Prem, Rathinam and Ramachandran.

శేఖర్ రెడ్డికి చెందిన రూ. 181 కోట్ల నగదు, 130 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. ఇటీవల శేఖర్ రెడ్డి మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

షాక్: సెక్రటేరియట్ లో ఐటీ దాడులు: వెంట పారామిలటరీషాక్: సెక్రటేరియట్ లో ఐటీ దాడులు: వెంట పారామిలటరీ

శేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ప్రేమ్ రెడ్డి, రతినం, రామచంద్రన్ లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ భారీ స్కాం కేసులో ఇంకా ఎంత మంది నాయకులు, వ్యాపారులు అరెస్టు అవుతారో అంతుపట్టడం లేదు.

English summary
CBI police arrested Sekar reddy's friends Prem Reddy, Rathinam and Ramachandran in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X