న్యూఢిల్లీ: డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్(డేరాబాబా) డేరా ప్రాంగణంలో 400 మంది తన అనుచరుల వృషణాలను బలవంతంగా తొలగించారన్న కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసింది.
2000 సంవత్సరంలో జరిగిన ఈ అమానుష ఘటనపై సీబీఐ విచారణను కోరుతూ హన్సరాజ్ చౌహాన్ అనే డేరా అనుచరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. ఈ నేపథ్యంలో డేరా చీఫ్‌ను ప్రశ్నించినట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు.

రోహ్తక్ జైలులో ఉన్న గుర్మీత్ సింగ్‌ను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు కలిసి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు 2015, జనవరిలో ఈ అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. డేరా బాబా.. ఇద్దరు సాధ్వీలపై అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!