వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

400మంది వృషణాల తొలగింపు: డేరాబాబా స్టేట్‌మెంట్ నమోదు చేసిన సీబీఐ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరా సచ్ఛ సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌(డేరాబాబా) డేరా ప్రాంగణంలో 400 మంది తన అనుచరుల వృషణాలను బలవంతంగా తొలగించారన్న కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసిం‍ది.

2000 సంవత్సరంలో జరిగిన ఈ అమానుష ఘటనపై సీబీఐ విచారణను కోరుతూ హన్సరాజ్‌ చౌహాన్‌ అనే డేరా అనుచరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వుల జారీ చేసింది. ఈ నేపథ్యంలో డేరా చీఫ్‌ను ప్రశ్నించినట్టు సీబీఐ ప్రతినిధి తెలిపారు.

 CBI questions Dera Sacha Sauda chief on ‘forced’ castration of 400 followers

రోహ్తక్‌ జైలులో ఉన్న గుర్మీత్‌ సింగ్‌ను ప్రత్యేక కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు కలిసి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పంజాబ్‌ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు 2015, జనవరిలో ఈ అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. డేరా బాబా.. ఇద్దరు సాధ్వీలపై అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

English summary
The Central Bureau of Investigation (CBI) has questioned Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh in connection with a three-year-old case pertaining to the “forced” castration of around 400 followers at his Sirsa ashram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X