వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఎన్డీ టీవీ అధిపతికి సీబీఐ ఝలక్: సోదాలు, బ్యాంకు మోసం కేసు, రిజర్వ్ బ్యాంక్ నో !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోమవారం ఉదయం సీబీఐ అధికారులు జాతీయ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ సహ యజమానులైన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ఇళ్లలో దాడులు నిర్వహించారు. ఓ ప్రైవేట్ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా తాము దాడులు చేశామని సీబీఐ అధికారులు దృవీకరించారు.

సోమవారం ఉదయం ఢిల్లీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ తో సహ నాలుగు చోట్ల సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారని వెలుగు చూసింది. అయితే మమల్ని వేదించడానికే సీబీఐ అధికారులు దాడులు చేశారని ఎన్డీటీవీ వర్గాలు మండిపడుతున్నాయి.

మీడియా కార్యాలయంలో !

మీడియా కార్యాలయంలో !

ఎన్డీటీవీ కార్యాలయంలో మాత్రం సీబీఐ అధికారులు సోదాలు చెయ్యలేదు. ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్ పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో సోమవారం ఉదయం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.

ఐసీఐసీఐ బ్యాంకులో రుణం !

ఐసీఐసీఐ బ్యాంకులో రుణం !

2008లో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో అక్రమాలు జరిగాయని గత వారంలో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రణవ్ రాయ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 366 కోట్లు రుణం తీసుకుందని సీబీఐ అధికారులు గుర్తించారు.

బ్యాంకుకు మోసం చేశారు !

బ్యాంకుకు మోసం చేశారు !

ప్రణయ్ రాయ్ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 366 కోట్లు రుణం తీసుకుని తరువాత రూ. 48 కోట్లు తక్కువ చెల్లించినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకును మోసం చేశారని ఆరోపిస్తూ సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మీడియా జోలికి మాత్రం నో !

మీడియా జోలికి మాత్రం నో !

ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ఇళ్లలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఎన్డీటీవీ కార్యాలయం జోలికి మాత్రం వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ఇళ్లలో, ఎన్డీ టీవీ ప్రమోటర్ కంపెనీ అయిన ఆర్ఆర్ పీఆర్ హోర్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

రూ. 2,030 కోట్ల వ్యవహారం ?

రూ. 2,030 కోట్ల వ్యవహారం ?

2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎన్డీటీవీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులో రూ. 2,030 కోట్ల అక్రమ లావాదేవీలు నిర్వహించారని, విదేశీ నగదు అక్రమ లావాదేవీలు (ఫెమా) నిర్వహించారని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేశారు.

రిజర్వు బ్యాంకు నో చెప్పింది !

రిజర్వు బ్యాంకు నో చెప్పింది !

ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులు రద్దు చెయ్యాలని ఎన్డీటీవీ నిర్వహకులు రిజర్వు బ్యాంకులో మనవి చేశారు. అయితే ఎన్టీటీవీ మనవిని రిజర్వు బ్యాంకు తరిస్కరించింది. అయితే ఇదో పెద్ద అపద్దం అంటూ ఎన్టీటీవీ కార్యాలయ వర్గాలు మండిపడుతున్నాయి.

మా మీద కక్షకట్టారు!

మా మీద కక్షకట్టారు!

మమ్మల్ని వేధింపులకు గురి చెయ్యడానికే సీబీఐ అధికారులు దాడులు చేశారని ఎన్డీటీవీ కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. చట్టపరంగా తాము విచారణ ఎదుర్కొంటామని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని ఎన్డీటీవీ వర్గాలు అంటున్నాయి.

English summary
This morning, the CBI stepped up the concerted harassment of NDTV and its promoters based on the same old endless false accusations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X