బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎంఏ స్కాం, సీబీఐ ఎంట్రీ, ఎఫ్ఐఆర్ లో 30 మంది, మాజీ మంత్రులు, ఐఏఎస్ లు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాం కేసును కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఐఎంఏ స్కాం కేసు దర్యాప్తును సీబీఐ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మొదలు పెట్టారు. కేసు విచారణ మొదలు పెట్టిన సీబీఐ ఇప్పటికే 30 మంది నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ మంత్రులు, ఐఏఎస్ అధికారులను విచారణ చేసి వివరాలు సేకరించారు.

పుట్టగోసిలో పదవి, ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? మాజీ ప్రధాని కొడుకు, బీజేపీ కక్ష రాజకీయాలు!పుట్టగోసిలో పదవి, ఉంటే ఎంత ? ఊడితే ఎంత ? మాజీ ప్రధాని కొడుకు, బీజేపీ కక్ష రాజకీయాలు!

30 మందికి లింక్ ?

30 మందికి లింక్ ?

ఐఎంఏ స్కాం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు మన్సూర్ ఆలీ ఖాన్ ప్రధాన నిందితుడు. మన్సూర్ ఆలీ ఖాన్ తో పాటు అనేక సంస్థలకు చెందిన వారికి ఈ కేసుతో సంబంధం ఉందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఐఎంఏ కేసులో అనేక మందిని విచారణ చెయ్యడానికి సీబీఐ అధికారులు సిద్దం అయ్యారు. ఇప్పటికే సీబీఐ అధికారులు 30 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

స్కాం నిందితులు వీరే !

స్కాం నిందితులు వీరే !

ఐఎంఏ జ్యూవెవెలర్స్ యజమాని మన్సూర్ ఆలీ ఖాన్ ప్రధాన అనుచరుడు నిజాముద్దీన్, నవీద్ అహమ్మద్, ఐఎంఏ డైరెక్టర్ వాసీం, అర్షద్ ఖాన్, అప్సర్ బాషా, అసాదుల్లా, శరాద్ అహమ్మద్ ఖాన్, ఇస్సార్ అహమ్మద్ ఖాన్, పుసేల్ అహమ్మద్, మోహమ్మద్ ఇద్రీష్, ఉస్మాన్ అబ్రేస్, సయ్యద్ మొజాహీద్ ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి.

 బెంగళూరు కలెక్టర్

బెంగళూరు కలెక్టర్

బెంగళూరు జిల్లాధికారిగా పని చేసిన విజయ్ శంకర్, అసిస్టెంట్ కలెక్టర్ (ఏసీ) ఎల్. సీ. నాగరాజ్, బీడీఏ అధికారి పీడీ. కుమార్, గ్రామ లెక్కాధికారి మంజునాథ్ తదితరుల మీద సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారని వెలుగు చూసింది.

ఐఎంఏ సంస్థలు

ఐఎంఏ సంస్థలు

శివాజీనగర్ ఐఎంఏ హెల్త్ కేర్, శివాజీనగర్ ఐఎంఏ జ్యువెలర్స్, శివాజీనగర్ ఐఎంఏ బిలియన్ ట్రేడింగ్, శివాజీనగర్ ఐఎంఏ కోఆపరేటివ్ -ఇ- సంస్థల మీద అధికారులు కేసు నమోదు చేశారు. ఐఎంఏ స్కాం కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( ఎస్ఐటీ) అధికారి రవికాంత్ గౌడ ఆధ్వర్యంలో విచారణ చేశారు.

బంగారు బిస్కెట్లు

బంగారు బిస్కెట్లు

మన్సూర్ ఆలీ ఖాన్ ను ఇప్పటికే అరెస్టు చేసిన ఎస్ఐటీ అధికారులు మన్సూర్ ఆలీ ఖాన్ కు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐటీ అధికారులు మన్సూర్ ఆలీ ఖాన్ కు చెందిన కేజీ నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.

మాజీ మంత్రుల విచారణ

మాజీ మంత్రుల విచారణ

ఎస్ఐటీ అధికారులతో సీబీఐ అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎంఐఏ స్కాం కేసులో ఎస్ఐటీ అధికారుల దగ్గర ఉన్న సాక్షాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. ఈ కేసులో మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జమీర్ అహమ్మద్, రోషన్ బేగ్ (అనర్హత ఎమ్మెల్యే)ను అధికారులు ఇప్పటికే విచారణ చేసి వివరాలు సేకరించారు.

English summary
CBI already taken over the IMA scam case. it lodged FIR against 30 people including some IMA organizations. Karnataka High Court directed SIT to submit detail report on Ggold biscuit sized during the probe of IMA scam. 5008 gold biscuit sized from the building belongs to Mansoor Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X