వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 రేప్ లు: తల్లీ, కుమార్తె గ్యాంగ్ రేప్ కేసు సీబీఐ చేతికి

|
Google Oneindia TeluguNews

బులంద్ షహర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసు విచారణ సీబీఐకి అప్పగించారు. కారులో వెలుతున్న కుటుంబ సభ్యులను అడ్డగించి వాహనంలో నుంచి తల్లీ, కుమార్తెను బయటకు లాగారు.

కారులో ఉన్న వారిని నిలువు దోపిడి చేసిన తరువాత తల్లీ, కుమార్తె (13) మీద అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. అలహాబాద్ హై కోర్టు ఆదేశాల మేరకు ఆ కేసు విచారణ సీబీఐ తీసుని దర్యాప్తు చేస్తున్నది.

బలంద్ షహర్ గ్యాంగ్ రేప్ కేసు విచారణ వేగవంతం చేశామని సీబీఐ సీనియర్ అధికారి దేవ్ ప్రీత్ సింగ్ నిర్దారించారు. పలు సెక్షలతో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు చెప్పారు.

CBI takes over Bulandshahr gangrape case probe

జులై చివరిలో నోయిడాకు చెందిన ఆరు మంది కుటుంబ సభ్యులు షాజహాన్ పూర్ లో తన బంధువు చనిపోతే వారిని పలకరించడానికి కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో బులంద్ షహర్ జిల్లాలోని 91వ నెంబర్ జాతీయ రహదారిలో ఓ ముఠా సభ్యులు వీరి వాహనాన్ని అడ్డగించారు.

తరువాత కుటుంబ సభ్యులను నిలువు దోపిడీ చేసి తల్లీ, కుమార్తెను గ్యాంగ్ రేప్ చేసి పరారైనారు. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్షం చేశారని, దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదని ఆరోపిస్తూ బాధితులు హై కోర్టును ఆశ్రయించారు.

పూర్తి వివరాలు తెలుసుకున్న హై కోర్టు పోలీసుల తీరుపై మండిపడింది. వెంటనే గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ గ్యాంగ్ రేప్ కేసులోని ప్రధాన నిందితుడు సలీం బావరియా 50 రేప్ లు చేశానని ఇప్పటికే అంగీకరించాడని సీబీఐ అధికారులు తెలిపారు.

English summary
The CBI on Friday took over the prob into the gangrape of woman and her teenaged daughter in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X