వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ డికే రవి మృతి కేసు: కారు డ్రైవర్ స్టేట్ మెంట్ కీలకం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. డికే.రవి కారు డ్రైవర్ ఎళంగోవన్ ఈ కేసులో మొదటి సాక్షి అని సీబీఐ అధికారులు అంటున్నారు.

ఎళంగోవన్ కు సమన్లు జారీ చేసిన సీబీఐ అధికారులు అతనిని విచారణ చేస్తున్నారు. అదే విధంగా డికే. రవి భార్య కుసుమ, మామ హనుమంతరాయప్ప, కుటుంబ సభ్యులను విచారణ చెయ్యాలని భావించారు. రవి మృతి కేసులో డ్రైవర్ చెప్పే విషయాలు కీలకం కానున్నట్లు భావిస్తున్నారు.

డ్రైవర్ విచారణకు అధిక ప్రాధాన్యత!

 CBI: the first person they will call in for questioning is his driver Elangovan.

గత మార్చి 16వ తేదీన కోరమంగల సమీపంలోని అపార్ట్ మెంట్ లో డికే రవి అనుమానాస్పదస్థితిలో మరణించారు. డికే రవిని కారులో అపార్ట్ మెంట్ దగ్గరకు పిలుచుకుని వెళ్లింది ఎళంగోవన్. డికే. రవి చివరి సారి ఎదురెదురుగా మాట్టాడింది కారు డ్రైవర్ ఎళంగోవన్ తోనే.

అయితే ఆరోజు నాగరబావిలోని మామ ఇంటి నుండి బయలుదేరిన డికే రవి కార్యాలయానికి చేరుకున్నారని, తరువాత అపార్ట్ మెంట్ కు వెళ్లారని వెలుగు చూసింది. అయితే ఆ మధ్యలో డికే రవి ఎవరెవరితో మాట్లాడారనే విషయం తెలియాలంటే ఎళంగోవన్ చెప్పే వివరాలు కేసు దర్యాప్తులో కీలకం కానుంది.

గతంలో కేసు దర్యాప్తు చేసిన బెంగళూరు సీఐడి అధికారులు ఎళంగోవన్ ను ప్రశ్నించారు. ఆ సందర్బంలో డికే రవి వ్యక్తి గత కారణాల వలన ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఎళంగోవన్ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు సీబీఐ అధికారులు ఎళంగోవన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకుంటున్నారు.

సీబీఐ కొత్త కేసు నమోదు!

రవి మరణించిన సమయంలో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గురువారం సీబీఐ అధికారులు కొత్త కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవి మరణించకు ముందు ఒక వారం ఎవరెవరిని కలిశారనే వివరాలు సేకరిస్తున్నారు.

డికే రవి వాణిజ్య పన్నుల విభాగం జాయింట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల దగ్గర ముక్కు పిండి కొన్ని కోట్ల రూపాయల వాణిజ్య పన్ను వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేశారు. ఆ సమయంలో ఎవరైనా డికే. రవిని బెదిరించారా అని ఆరా తీస్తున్నారు.

కోలారులో విచారణ!

సీబీఐ అధికారులు బృందాలుగా విడిపోయి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక బృందం కోలారు వెళ్లి విచారణ చేస్తున్నారు. రవి కోలారులో పని చేసే సమయంలో స్యాండ్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేశారు. ఆ సమయంలో కోందరు రాజకీయ నాయకులు రవిని బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Central Bureau of Investigation begins its probe into the death of IAS officer DK Ravi, the first person they will call in for questioning is his driver Elangovan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X