వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐకి భారీ షాక్: 40వేల సాక్ష్యాలు, 100 ఆడియో, వీడియో టేపులు నిరాధారం - తీర్పుపై సవాలు దిశగా

|
Google Oneindia TeluguNews

దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టంగా పరిగణించే బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి భారీ షాక్ తగిలినట్లయింది. విచారణ ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ, సీబీఐ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన కేసుల్లో ఒకటైన బాబ్రీ మసీదు ఉదంతంలో.. నేరపూరిత కుట్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు సందర్భంగా జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్.. సీబీఐ సేకరించిన ఆధారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును సవాలు చేసే అంశంపై సీబీఐ తరఫు న్యాయవాది కీలక సమాచారం అందించారు..

మసీదును కూల్చడంవల్లే మందిరం - ఇక ఈ ఎపిసొడ్‌ను మర్చిపోవాలి - శివసేన సంచలన కామెంట్లు మసీదును కూల్చడంవల్లే మందిరం - ఇక ఈ ఎపిసొడ్‌ను మర్చిపోవాలి - శివసేన సంచలన కామెంట్లు

40 రోజుల్లోనే సీబీఐ చార్జిషీట్..

40 రోజుల్లోనే సీబీఐ చార్జిషీట్..


తాము రామ జన్మభూమిగా భావించే చోట మొఘల్ పాలకులు ఏర్పాటుచేసిన మసీదును తొలగించి, అక్కడ మందిరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సంఘ్ పరివార్ సంస్థలైన బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ తదితర నేతలు 1992లో అయోధ్య ముట్టడికి పిలుపునివ్వడం, అదే ఏడాది డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరగడం, అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో 2వేల మంది చనిపోవడం తెలిసిందే. కూల్చివేత ఘటనపై నమోదైన రెండు ప్రధాన ఎఫ్ఐఆర్ లలో మొదటికేసును సీబీఐ, రెండో కేసును ఉత్తరప్రదేశ్ సీఐడీ విభాగాలు దర్యాప్తు చేశాయి. గందరగోళాన్ని నివారిస్తూ, 1993 ఆగస్టు 27న అన్ని కేసుల్నీ సీబీఐ చేతికి అప్పగించారు. ఆ తర్వాత మరో 47 కేసులు కూడా నమోదయ్యాయి. రెండు ప్రధాన కేసుల్ని సీబీఐ చేపట్టి సరిగ్గా 40 రోజులు తిరిగేలోపే.. అంటే, 1993 అక్టోబర్ 5న మొదటి చార్జిషీటును దాఖలు చేసింది. మళ్లీ మూడేళ్లకు, 1996 జనవరి 10న అనుబంధ చార్జిషీటు వేసింది. వాటిలో..

తీర్పుపై అద్వానీ అనూహ్య రియాక్షన్ - బీజేపీ నేత ఇంటి వద్ద భారీ హడావుడి - ఈ ఐదు పాయింట్లే కీలకంతీర్పుపై అద్వానీ అనూహ్య రియాక్షన్ - బీజేపీ నేత ఇంటి వద్ద భారీ హడావుడి - ఈ ఐదు పాయింట్లే కీలకం

40వేల సాక్ష్యాలు, 100 టేపులు..

40వేల సాక్ష్యాలు, 100 టేపులు..

బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన తర్వాత మూడేళ్ల వ్యవధిలో రెండు చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ.. వాటిలో కీలక ఆధారాలను పొందుపర్చింది. బీజేపీ నేత ఎల్కే అద్వానీ సహా మొత్తం 49 మంది నిందితులు(అందులో 17 మంది చనిపోగా, 32 మంది జీవించి ఉన్నారు) నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, పథకం ప్రకారమే మసీదును కూల్చేశారనడానికి రుజువులుగా సీబీఐ.. 40వేల మంది ప్రత్యక్ష్య సాక్ష్యాల వాగ్మూలాలను నమోదు చేసింది. అంతేకాదు, వివిధ టీవీ ఛానెళ్లు, రికార్డర్ల ద్వారా లభ్యమైన 100కుపైగా ఆడియో, వీడియో టేపులను కోర్టుకు సమర్పించింది. 28ఏళ్ల విచారణలో చివరికి సీబీఐ సమర్పించిన ఆధారాల్లో ఏ ఒక్కటీ నిందితులు నేరం చేశారనే విషయాన్ని రూఢీ చేయడంలేదని స్పెషల్ కోర్టు జడ్జి చెప్పడం గమనార్హం.

రివర్స్‌లో సీబీఐ దర్యాప్తు..

రివర్స్‌లో సీబీఐ దర్యాప్తు..

మసీదు విధ్వంసం కేసులో తీర్పు చెబుతూ స్పెషల్ కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ చేసిన వ్యాఖ్యలు.. సీబీఐ దర్యాప్తు తీరును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఎల్కే అద్వానీ సహా నిందితులందరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ వాదించగా.. జడ్జి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ‘‘కూల్చివేతకు ముందు కుట్రప్రణాళిక జరగలేదని, నిజానికి నిందితులందరూ కూల్చివేతను ఆపేసే ప్రయత్నం చేశారని, సంఘవిద్రోహులు క్షణికావేశం వల్లే మసీదు కూలిపోయింద''ని తీర్పులో పేర్కొన్నారు. అంతేకాదు, సీబీఐ సమర్పించిన ఆడియో, వీడియో టేపులు అథెంటిక్ అని చెప్పడానికి కూడా లేదని, మొత్తంగా నేరాన్ని రుజువు చేసే ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ సమర్పించలేకపోయిందని జడ్జి అన్నారు. జడ్జి మాటలను బట్టి.. జరిగిన ఘటలపై సీబీఐ రివర్స్ లో దర్యాప్తు చేసి, నిరాధారమైన అంశాలను కోర్టు ముందుంచిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతిష్టాత్మకమైన కేసులో ఇంత వ్యతిరేకంగా తీర్పు రావడంపై సీబీఐ ఆలోచనలో పడింది. ఆ క్రమంలోనే..

స్పెషల్ కోర్టు తీర్పుపై సవాలు..

స్పెషల్ కోర్టు తీర్పుపై సవాలు..

బాబ్రీ మసీదు కేసులో లక్నో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే దిశగా సీబీఐ అడుగులు వేస్తున్నది. బుధవారం లక్నో కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన సీబీఐ తరఫు లాయర్ లలిత్ సింగ్ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘స్పెషల్ కోర్టు తీర్పు కాపీ అందిన వెంటనే దానిని ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు పంపుతాం. అక్కడి లీగల్ విభాగం.. ఈ తీర్పును ఆసాంతం పరిశీలించిన తర్వాత.. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంటాం. అతి త్వరలోనే మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం'' అని సీబీఐ అడ్వొకేట్ సింగ్ తెలిపారు. అయోధ్య భూవివాదంపై తీర్పు సందర్భంలో సుప్రీంకోర్టు.. బాబ్రీ మసీదు కూల్చివేతను తీవ్ర నేరంగా పరిగణిస్తున్నట్లు వ్యాఖ్యానించిన దరిమిలా, పై కోర్టుల్లో తమ వాదనకు బలం చేకూరొచ్చని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
The Central Bureau of Investigation (CBI) will decide on filing an appeal against the special court verdict acquitting all 32 accused in the Babri Masjid demolition case after consulting the legal department, its counsel Lalit Singh said on Wednesday. Singh was replying to a query on whether the investigating agency will challenge the verdict of the special court, which acquitted all the 32 accused, including BJP veterans LK Advani, MM Joshi, Uma Bharti and Kalyan Singh, in the politically sensitive case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X