వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE 10వ తరగతి 12వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల: ఇక్కడ తెలుసుకోండి..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)పదవ తరగతి 12వ తరగతి పరీక్షలకు సంబంధించి తేదీలను విడుదల చేసింది. మే 6 నుంచి జూన్ 7, 2021 వరకు జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు కలిగిన టైమ్ టేబుల్‌ను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inలో పొందుపర్చడం జరిగింది. ఇక సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల ఫలితాలు జూలై 15, 2021న విడుదలవుతాయి. ఇక ప్రాక్టికల్స్ కూడా ఆయా స్కూళ్లలో 1 మార్చి 2021 నుంచి నిర్వహించడం జరుగుతుంది.

10వ తరగతి సీబీఎస్‌ఈ డేట్ షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

ముందుగా cbse.nic.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి

హోమ్ పేజ్‌పై "CBSE Class 10 date sheet" అనే లింక్‌పై క్లిక్ చేయండి

సీబీఎస్ఈ 10వ తరగతి డేట్ షీట్ 2021 అనేది స్క్రీన్ పై కనిపిస్తుంది. అక్కడ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి

పీడీఎఫ్ ఫార్మాట్‌లో దీన్ని ప్రింట్ తీసుకుని ఉంచుకోండి

CBSE 10th and 12th Board exam date sheet released,know the details here

ఇక సీబీఎస్‌ ప్రాక్టికల్స్ మార్చి-ఏప్రిల్ నెలల్లో ఆయా స్కూళ్లలోనే జరుగుతాయి. ఇప్పటికే విద్యార్థులు బోర్డు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావాల్సి ఉన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో స్కూళ్లను తెరిచాయి ఆయా ప్రభుత్వాలు. ఇక సిలబస్ తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ముందు చాలామంది విజ్ఞప్తులు ఉంచడంతో అన్ని సాద్యసాధ్యాలు పరిశీలించిన మీదట 10వ తరగతిలో 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఇక సీబీఎస్‌ఈ రివైజ్డ్ సిలబస్‌ను cbseacademic.nic.in అనే వెబ్‌సైట్ పై పొందుపర్చారు.

సాధారణంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఈ సారి పరీక్షలను మే-జూన్ నెలలో నిర్వహించడం జరుగుతోంది.

English summary
Central Board of Secondary Education (CBSE) has released the Class 10 date sheet on its official website cbse.nic.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X