వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల: ఇక్కడ చెక్ చేసుకోండి..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు శనివారం మధ్యాహ్నాం విడుదలయ్యాయి. పరీక్షల్లో 83.01శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది.

ఇక మార్కుల విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన మేఘనా శ్రీవాస్తవ టాపర్‌గా నిలిచింది. సీబీఎస్ఈ పరీక్షల్లో మేఘనా 500కి 499 మార్కులు సాధించడం విశేషం. ఆమె తర్వాతి స్థానంలో ఎస్ఏజే స్కూలుకు చెందిన అనౌష్క చంద్ర (498) నిలిచారు. మరో ఏడుగురు విద్యార్థులు 497 మార్కులు సాధించారు.

CBSE 12th Result 2018: CBSE class 12 results announced, check here

సీబీఎస్ఈలో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన ప్రాంతాలుగా త్రివేండ్రం (97.32%), చెన్నై(93.87%), ఢిల్లీ(89%) నిలిచాయి. ఇక సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు కూడా రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సీబీఎస్ఈ సెక్రటరీ అనురాగ్ త్రిపాఠి తెలిపారు.

కాగా, ఈ సంవత్సరం 10,12వ తరగతులకు కలిపి మొత్తం 28లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 3 నుంచి ఏప్రిల్ 13వరకు జరగాల్సి ఉండగా.. ఎకనమిక్ పేపర్ లీకేజీ కారణంగా ఏప్రిల్ 25వ తేదీ వరకు కొనసాగాయి.

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇలా తెలుసుకోండి:

మీ సెల్ ఫోనులో సీబీఎస్ఈ12 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రూల్ నంబర్ టైప్ చేసి స్కూల్ నంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి సెంటర్ నంబర్ ఎంటర్ చేసి 7738299899 నంబర్ కు మెసేజ్ పంపించి మీ ఫలితాలు తెలుసుకోవచ్చు.

సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbse.nic.in or cbseresults.nic.in సందర్శించి, 'సీనియర్
స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(Class XII)2018'పై క్లిక్ చేసి.. రూల్ నంబర్ సహా అవసరమైన వివరాలను ఎంటర్ చేస్తే మీ ఫలితాలు తెలుస్తాయి.

English summary
The Central Board of Secondary Education (CBSE) declared the Class 12 results this afternoon on the official website of the board -- cbseresults.nic.in or cbse.nic.in. This year, the pass percentage has improved to 83.01 per cent from 82.02 per cent last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X