వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE Board Exam 2021 Date -మే 4 నుంచి పరీక్షలు -కేంద్ర విద్యా మంత్రి కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం కారణంగా సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్ఈ)-2021 ప‌రీక్ష‌లపై నెలకొన్న సందిగ్ధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తొలగించింది. CBSE Board Exam 2021 కు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ గురువారం సాయంత్రం‌ ప్రకటించారు.

సీబీఎస్ఈ 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు (సీబీఎస్ఈ-2021) పరీక్షలు మే 4 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహిస్తామని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని, జూలై 15న పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ షాక్ -పోలీసుల ఎంట్రీతో అనూహ్య ట్విస్ట్ఒంగోలు: ఆమె ఇంట్లో దొంగలు పడ్డారు.. ఎదురింటాయనకు భారీ షాక్ -పోలీసుల ఎంట్రీతో అనూహ్య ట్విస్ట్

CBSE Board Exam 2021: CBSE 10th, 12th exams to begin from May 4: Minister Pokhriyal

విద్యారంగంపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపడంతో పాటు తాజాగా కొత్త స్ట్రెయిన్‌ కలకలం నేపథ్యంలో ఈ పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. అనేకమంది విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేయాలని మంత్రిని ట్విటర్‌ వేదికగా అభ్యర్థించారు. పరీక్షలపై సన్నద్ధతకు సమయం ఇచ్చేలా మే నెలలో ఈ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు సరిగా జరగడంలేదని వాపోయారు. దీంతో..

నిజానికి ఈ నెల 22 నుంచే సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం భావించినప్పటికీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను మే 4 నుంచి నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు ఏయే ప‌రీక్ష‌లను ఏయే తేదీల్లో నిర్వ‌హిస్తార‌నే వివ‌రాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాల‌ని విద్యా మత్రి సూచించారు.

తిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూతిరుపతిలో ఘోరం: భార్య అందాలే పెట్టుబడిగా భర్త వ్యాపారం -ఓయో రూమ్‌లో గంటకు రూ.3వేలంటూ

CBSE Board Exam 2021: CBSE 10th, 12th exams to begin from May 4: Minister Pokhriyal

కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్న మంత్రి పోఖ్రియాల్.. పరీక్షా కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కేంద్రం ప్రకటనతో పరీక్షలపై విద్యార్థుల సందేహాలు, అనుమానాలు తీరినప్పటికీ, పరీక్షలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో ప్రిపరేషన్ కు సమయం సరిపోతుందా? లేదా? అనేది చూడాలి.

English summary
Union Education Minister Ramesh Pokhriyal Nishank announced the dates of the Central Board of Secondary Education (CBSE) classes 10 and 12 exams. The CBSE exam will be held from May 4 to June 10. The datesheet however, is not released today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X