వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE Board Exams 2020: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30వరకు పరీక్షలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతికి సంబంధించిన బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2020 ఫిబ్రవరి 15 నుంచి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నట్లు డేట్ షీట్‌లో పేర్కొంది. విద్యార్థులు పరీక్షకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను డేట్ షీట్‌ నుంచి పొందొచ్చని వెల్లడించింది. లేదంటే సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవచ్చని తెలిపింది.

షెడ్యూల్ ఇలా ఉంది

షెడ్యూల్ ఇలా ఉంది

సీబీఎస్‌ఈ 10వ తరగతికి బోర్డు మెయిన్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. మరి 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30వరకు జరుగుతాయి. పోయినసారి 10వ తరగతి పరీక్షలు మార్చి 7 నుంచి 29, 2019 వరకు జరుగగా, 12 వ తరగతి పరీక్షలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 2, 2019వరకు జరగనున్నాయి.

CBSE 10వ తరగతి టైం టేబుల్:

బుధవారం ఫిబ్రవరి 26: ఇంగ్లీషు

శనివారం ఫిబ్రవరి 29: హిందీ

బుధవారం మార్చి 4 : సైన్స్

గురువారం మార్చి 12 : మ్యాథ్స్

బుధవారం మార్చి 18: సోషల్ సైన్స్

పరీక్షల కోసం విద్యార్థులు ప్లానింగ్ చేసుకోవాలి

పరీక్షల కోసం విద్యార్థులు ప్లానింగ్ చేసుకోవాలి

ఇక సీబీఎస్‌ఈ పరీక్షల తేదీలు విడుదల చేయడంతో విద్యార్థులు ఒక ప్లానింగ్‌తో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు సమానంగా సమయాన్ని కేటాయించి చదవాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఓవరాల్‌గా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక టెక్ట్స్‌ బుక్స్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి కనుక వాటిమీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు పాత క్వశ్చన్ పేపర్లను కూడా ఒకసారి తిరిగేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

టెన్షన్ పడొద్దని విద్యార్థులకు సూచిస్తున్న నిపుణులు

టెన్షన్ పడొద్దని విద్యార్థులకు సూచిస్తున్న నిపుణులు

ఇక పరీక్షలు ఉదయం సెషన్‌లో జరుగుతాయి. అంటే ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్ష ముగుస్తుంది. ఉదయం 10 గంటలకు ఆన్సర్ షీట్లు ఇవ్వడం జరుగుతుంది. 10 గంటల 15 నిమిషాలకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఇక 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఈ 15 నిమిషాల గ్యాప్‌లో విద్యార్థులు ప్రశ్నా పత్రాన్ని జాగ్రత్తగా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ సమయంలో సులభమైన ప్రశ్నలను మార్క్ చేసుకోవాలని చెబుతున్నారు. ఒక్కసారి పరీక్ష ప్రారంభం అయ్యాక ముందుగా సులభమైన ప్రశ్నలకు సమాధానం రాసి ఆ తర్వాత కష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవుతుందని సూచిస్తున్నారు.

ఒక వేళ ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే కంగారు లేదా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మరో సులభమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మధ్యలో మంచినీళ్లు తీసకుని కాస్త రిలాక్స్ అవ్వాలంటూ విద్యార్థులకు సూచనలు చేస్తున్నారు నిపుణులు.

English summary
CBSE date sheet for the theory papers has been released. The Central Board of Secondary Education or CBSE will conduct the Class 10 and Class 12 examinations from February 15 and will be concluded on March 30
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X