వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE 10th Results 2020: 10వ తరగతి ఫలితాల్లో 91.46శాతం ఉత్తీర్ణత నమోదు

|
Google Oneindia TeluguNews

రెండు రోజుల క్రితం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయగా బుధవారం రోజున సీబీఎస్‌ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను సీబీఎస్' అధికారిక వెబ్‌సైట్‌ cbseresult.nic.inపై పొందుపర్చింది. మొత్తంగా 18 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

వీరంతా ఆన్‌లైన్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు విద్యార్థులు ఇతర మార్గాల ద్వారా అంటే ఉమాంగ్ యాప్, డిజిలాకర్, ఎస్ఎంఎస్ మరియు ఐవీఆర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే ఏర్పాటును సీబీఎస్‌ఈ బోర్డు చేసింది.ఇదిలా ఉంటే కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల చేయడం జరిగిందని అది తెలుసుకునేందుకు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన ట్వీట్ చేశారు.

CBSE class 10 results 2020 released, Here is how you need to check the result

ఇక ఈ సారి ఉత్తీర్ణత శాతం 2019కంటే స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ సారి ఉత్తీర్ణత శాతం 91.46శాతంగా ఉండగా 2019లో 91.19శాతంగా నమోదైంది. అయితే 12వ తరగతి ఫలితాలు మాత్రం గతేడాదితో పోలిస్తే 5శాతం ఎక్కువగానే ఉత్తీర్ణత శాతం కనిపించింది.

ఇక ఈ సారి పాసింగ్ విధానంలో స్వల్ప మార్పులు జరిగాయి. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయ్యాడని చెప్పేందుకు కనీసం 33శాతం మార్కులు సాధించి ఉండాలి. 10వ తరగతి విద్యార్థులకు బెస్ట్ ఆఫ్ ఫైవ్ సబ్జెక్టు వ్యాలిడిటీ ఉంటుంది. 33శాతం మార్కులు సాధించని విద్యార్థులకు పాస్ అయ్యేందుకు మరొక అవకాశం కల్పిస్తారు. మార్కుల జాబితాను ఆన్‌లైన్ ద్వారా లేదా డిజిలాకర్ ద్వారా పొందుచ్చని సీబీఎస్‌ఈ పేర్కొంది.

అంతేకాదు ఈ కరోనాకాలంలో కష్టపడి 10వ తరగతి పరీక్ష పత్రాలను వాల్యుయేట్ చేసి ఫలితాలను విడుదల చేయడంలో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, నాణ్యతతో కూడిన విద్యను అందించడమే తమ తొలి ప్రాధాన్యతగా ఉంటుందని మంత్రి పోఖ్రియాల్ చెప్పారు.

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం:

1.cbseresults.nic.in

2.CBSE class 10 results 2020 పై క్లిక్ చేయండి.

3. మీ హాల్‌టికెట్ నెంబర్ టైప్ చేసి లాగిన్ అవ్వండి

Recommended Video

CBSE Syllabus నుంచి Federalism, Secularism చాప్టర్లు తొలగింపు!! || Oneindia Telugu

4. మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి.

English summary
CBSE 10th results were anounced on July 15th. 2020 year class 10 CBSE results witnessed 88.78% pass percentage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X