వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల: తిరువనంతపురం ఫస్ట్ ప్లేస్..ఓవరాల్‌ ఉత్తీర్ణత శాతం ఇదే..!

|
Google Oneindia TeluguNews

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 88.78శాతం పాస్ పర్సెంటేజ్‌ను నమోదు చేసింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30, 2020 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడో రావాల్సి ఉండగా దేశంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పేపర్లు వాల్యువేషన్‌లో జాప్యం జరిగింది. ఇక అన్‌లాక్‌ అమల్లోకి రావడంతో పేపర్ వాల్యుయేషన్ పూర్తి కావడంతో జూలై 13న సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది.


ఇక ఎప్పటిలానే ఈ సారి తిరువనంతపురం 97.67 శాతం పాస్ పర్సంటేజ్‌తో తొలిస్థానంలో నిలువగా రెండో స్థానంలో (97.05%) బెంగళూరు నిలిచింది. మూడో స్థానంలో చెన్నై (96.17%) నిలిచింది. గతేడాది ఉత్తీర్ణత శాతం 83.40గా ఉండగా ఈ సారి 88.78శాతంగా ఉంది. అంటే ఉత్తీర్ణత శాతం 5.38శాతం పెరిగింది. అన్ని సబ్జెక్టులకు గాను 90శాతానికి పైగా మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య 157934గా నమోదైంది. అంటే 13.24శాతం మంది 90శాతం మార్కులకు పైగా ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు అన్ని సబ్జెక్టుల్లో కలిపి 95శాతం మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 38686గా ఉండగా వారి శాతం 3.24గా రికార్డ్ అయ్యింది.

CBSE class 12 results released, 88.78% overall pass percentage recorded

ఇదిలా ఉంటే సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల కావాల్సి ఉంది. జూలై 15లోగా ఈ ఫలితాలు కూడా విడుదల అవుతాయని సమాచారం. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల్లో 10వ తరగతి ఫలితాలపై ఒక్కింత ఆందోళన నెలకొంది. 12వ తరగతి ఫలితాలతో పాటే 10వ తరగతి ఫలితాలు కూడా విడుదల చేస్తారని భావించిన వారికి నిరాశ మిగిలింది. సాధారణంగా 12వ తరగతి ఫలితాల విడుదల తర్వాతే 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తూ వస్తోంది సీబీఎస్‌ఈ బోర్డు. ఈ సారి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఫలితాల ప్రకటన ఆలస్యం కాగా 12వ తరగతి 10వ తరగతి ఫలితాలు ఏకకాలంలో విడుదల చేస్తారని భావించారు.

English summary
CBSE 12th results were released on July 13th. 2020 year class 12 CBSE results witnessed 88.78% pass percentage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X